కింగ్ అండ్ క్వీన్ మేమే...రెడ్ రోజ్ తో ప్రొపోజ్ చేసిన రీతూ..రోహిణి నువ్వు నా హీరోయిన్ వి
on Feb 14, 2026

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో ఐతే వామ్మో అనిపించేలా ఉంది. ఎందుకంటే వాలెంటైన్స్ డే స్పెషల్ కాబట్టి. అందులోనూ కొత్త కొత్త లవ్ ప్రొపోజల్స్ కూడా. ఎవరెవరు ప్రొపోజ్ చేసుకున్నారో చూద్దాం. డీమన్ పవన్ కి రీతూ ప్రొపోజ్ చేసింది. "పవన్ అంతకుముందు ఉన్న రీతుని మొత్తం మార్చేసి ప్లైన్ గా ఉన్న లైఫ్ ని చాలా కలర్ ఫుల్ గా మార్చేశావ్. ఐ లవ్ యు" అంటూ రీతూ ఒక రెడ్ రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసింది. అంతే కాదు ఒక రెడ్ టీ షర్ట్ లు తెచ్చింది. కింగ్ అంటూ ప్రింట్ వేసిన టీ షర్ట్ ని పవన్ కి ఇచ్చింది. క్వీన్ అన్న టీ షర్ట్ ని రీతూ వేసుకుంది. అలా క్యూట్ గా నడుచుకుంటూ వచ్చి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు. తర్వాత రోహిణి రెడ్ రోజ్ తో రిషి సర్ దగ్గరకు వచ్చింది. "గుప్పెడంత మనసు చూసిన దగ్గర నుంచి నా గుప్పెడంత మనసు నీ కోసమే గుప్ గుప్ మంటూ నీ కోసమే ఎదురు చూస్తోంది. అందరి ముందు చెప్పేది కాదు గాని చెప్తున్నా ఐ లైక్ యు..నువ్వొప్పుకుంటే ఐ లవ్ యు" అంటూ రెడ్ రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసింది.
దాంతో గుప్పెడంత మనసు రిషి సర్ "యాక్సెప్టెడ్" అనేశాడు. "ఏదో పెద్ద హీరోయిన్ ని పెళ్లి చేసుకుందామనుకున్నా కానీ పర్వాలేదు నా కళ్ళకు ఇప్పుడు నువ్వే పెద్ద హీరోయిన్" అన్నాడు. అంతే అందరూ నవ్వేశారు. తర్వాత నైనికా వచ్చింది. ఇక ఇమ్మానుయేల్ వచ్చి రెడ్ రోజ్ తో ఒక బాక్స్ ని తీసుకొచ్చి ప్రొపోజ్ చేయడానికి నిలబడ్డాడు. నైనికా డాన్స్ వేస్తుంది కాబట్టి ఆమెకు ఏ దెబ్బలు తగలకుండా చేతికి హ్యాండ్ కాప్ తెచ్చాడు. "ఇది కామెడీ అన్నారు కదా" అంటూ విష్ణు ప్రియా మధ్యలో వచ్చేసరికి ఇమ్ముకు కోపం వచ్చింది. "నేను చేసే ప్రొపోజల్ ని కామెడీ అనకు" అంటూ శ్రీముఖి చేతిలో ఉన్న బాక్స్ ని విసిరికొట్టాడు. పృద్వి వెంటనే ఓయ్ అని అరిచాడు. "నేను ఆమెను అన్నా. నీకు ఆమెకు ఏమిటి సంబంధం" అనేసి నైనికా మీద విరుచుకుపడ్డాడు. పో పో అంటూ గసిరాడు. "నా ప్రేమను ఎవరైనా కించపరిస్తే" అన్నాడు ఇమ్ము.."నీ ప్రేమను నువ్వే కించపరుచుకున్నావ్" అన్నాడు హరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



