అలాంటి కోరికలు చంపుకుని టీవీలో వచ్చాకే చూడండి
on Dec 3, 2025
.webp)
ఈమధ్య కొన్ని సైట్స్ లో కొత్త కొత్త మూవీస్ ని పోస్ట్ చేయడం జనాలు వాటిని చూడడం మనం చూస్తూనే ఉన్నాం. ఐ-బొమ్మ అందులో టాప్. ఐతే ఇప్పుడు ఆ సైట్ నడిపే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాని మీద కామెంట్స్ చేసింది శ్రీవాణి ఒక ఇంటర్వ్యూలో. "ఐ-బొమ్మ రవి అని నువ్వు విన్నావా..దాని మీద నీ ఒపీనియన్ ఏంటి..రీసెంట్ గా అతన్ని అరెస్ట్ చేశారు " అని వర్ష అడిగేసరికి "నాకు తెలీదు. నేను ఐ-బొమ్మలో సినిమాలు చూడను. థియేటర్ కి వెళ్లి పాప్-కార్న్ తింటూ చక్కగా సినిమా చూస్తాం. నిజానికి అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సినిమా ఎంతోమంది కష్టం కదా. వాళ్ళు ఏళ్ల తరబడి కథ ఆలోచించుకుని ఆ స్క్రిప్ట్ రాసుకుని డైరెక్టర్స్ ని వెతుక్కుని షూటింగ్ లొకేషన్స్ లో పగలనక, రాత్రనక కష్టపడి నటిస్తారు.
అంత కష్టపడి చేసిన ఒక మూవీని సింపుల్ గా తీసుకెళ్లి ఒక లింక్ లో పెట్టడం అనేది తప్పు దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అయ్యో మేము చూడలేకపోతున్నాం అనుకుంటే టీవీ అంటూ మన ఇంట్లో ఉంటుంది కదా అందులో వచ్చినప్పుడు చూడండి. అలాంటి కోరికలు చంపుకోండి. మూవీస్ ని లింక్స్ లో పెట్టడం వలన ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు నష్టపోయి ఎందుకు ఇదంతా. ఉన్నవాళ్లు ఫామిలీతో సరదాగా బయటకు వెళ్ళండి థియేటర్ కి వెళ్ళండి చూడండి. మిగతావాళ్ళు ఆ లింకులను ఎంకరేజ్ చేయకండి. మేము చూడలేకపోతున్నాం అని అనకండి టీవీలో సీరియల్స్ చూడండి ఎందుకంటే మా సీరియల్స్ టీవీలో ఫ్రీగా వస్తాయి నెలకు 200 కడితే. మా ఛానెల్స్ చూడండి. రెండు మూడు నెలలు ఆగితే ఆ సినిమాలే టీవీలో వేస్తారు. అంతే కానీ ఈ చెత్త లింక్ ని క్లిక్ చేసి సినిమాలు చూడకండి అందులో ఎంతోమంది కష్టం ఉంది కదా" అంటూ చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



