బిగ్ బాస్ 5.. ప్రియ సంపాదన ఎంతో తెలుసా?
on Oct 27, 2021
టాలీవుడ్‌లోని అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రియ ఒకరు. నటిగా ఫర్వాలేదనిపించే అవకాశాలు ఉన్న ఆమె.. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఇండస్ట్రీలోని పలువురిని ఆశ్చర్యానికి గురిచేశారు. హౌస్‌లో తన ప్రవర్తనతో తోటి కంటెస్టెంట్ల మనసుల్నే కాకుండా, ఆడియెన్స్‌నూ ఆకట్టుకున్నారు. అయినప్పటికీ ఏడవ వారంలో ఆమె ఎలిమినేషన్‌కు గురై, హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఏదేమైనా ఈ షోతో ప్రియ పాపులారిటీ మరింతగా పెరిగిందనేది వాస్తవం.
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ఆమెను ప్రేరేపించింది ఏమిటి? చాలావరకు దాని ద్వారా వచ్చే డబ్బేనని చెప్పాలి. ఇండస్ట్రీలో వినిపిస్తున్నది నిజమే అయితే ఈ షోలో పాల్గొన్నందుకు వారానికి ఆమెకు రూ. 3.2 లక్షలు అందాయంట. ఈ లెక్కన ఏడు వారాల పాటు ఉన్న ఆమెకు సుమారు రూ. 23 లక్షలు అందుతున్నట్లే. ఇది కాకుండా ఈ షోలో పాల్గొన్నందుకు గ్యారంటీ మనీ కింద మరికొంత కూడా వస్తుందని చెప్పుకుంటున్నారు.
చాలా తక్కువ సమయంలోనే ఆమె ఎక్కువ సంపాదించినట్లు లెక్క. అదే సినిమాల్లో అయితే ఆమె ఇంత సంపాదించి వుండదని అనుకుంటున్నారు. ఏదేమైనా డబ్బుకు డబ్బు, పేరుకు పేరు.. రెండూ ప్రియ ఖాతాలోకి వచ్చాయి. ఆమె స్కిల్స్ ఏమిటో తెలిశాయి కాబట్టి, సినిమాల్లో ఇకనైనా ఆమె ప్రతిభకు తగ్గ అవకాశాలు వస్తాయేమో చూడాలి.
Also Read