
ఆట లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పాడు. " మీరంటే మాలాంటి వాళ్లకు ఒక్క విషయంలో జెలస్ ఉంటది. మా అందరికీ దక్కని అదృష్టం మీకు దక్కింది. అది చెప్పడం కంటే చూపిస్తేనే బాగుంటుంది" అంటూ ఒక పిక్ ని ప్లే చేయించాడు సుధీర్.
ఆ ఫోటో వెనక స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్. " చిన్నప్పుడు మా అమ్మ షాపింగ్ కి వెళ్తూ మా మావయ్య దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. ఆయన నన్ను ఆడించేసరికి నిద్రొచ్చేసింది. అలా నన్ను కాళ్ళ మధ్య పెట్టేసుకుని నిద్రపోయారు. " అని చెప్పాడు తేజ్. "మీరు ఎక్కడ వెళ్ళిపోతారో అని కాళ్లతో లాక్ చేసేసారు " అన్నాడు సుధీర్. "చిన్న సైజు హ్యూమన్ కేజ్ లో పెట్టాడు బాబాయ్ బావని " అని నిహారిక చెప్పింది. ఆ రోజుల్లో పెద్దగా ఉయ్యాలలు అవీ లేవు కదా అందుకే అలా పెట్టారు. "చాలా క్యూట్" అంటూ రాధికా ఖుషీ అయ్యారు. "అందులో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రేమ కనబడుతోంది. ఎక్కడ పడిపోతారనే అని గట్టిగా కాళ్లతో పట్టుకున్నారు.
ఇందుకే సర్ మేమంతా కొంచెం కుళ్ళుకునేది.మేమంతా కొంచెం జెలస్ ఫీలయ్యేది " అన్నాడు సుధీర్. " తప్పులేదులే. హ్యాపీగా జెలస్ ఫీలవ్వచ్చు " అన్నాడు తేజ్. ఇక తేజ్ గురించి రఘు మాష్టర్ మాట్లాడారు. " ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉంటూ డార్లింగ్ అని పిలుచుకునే మంచి వ్యక్తి ఎవరూ దొరకలేదు నాకు. మేము కలిసి జర్నీ చేసి షూటింగ్ లో కూడా అల్లరి చేసేవాళ్ళం. మాకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఉండేది. నాకు ఇష్టమైన వ్యక్తి. తేజ్ ది రాబోతున్న మూవీలో కూడా వర్క్ చేసాను " అని చెప్పారు.




.webp)
.webp)
