ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి ఈ వారం లెనిన్ మూవీ హీరో హీరోయిన్ వచ్చారు. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ వచ్చారు. ఇక ఇందులో వీళ్ళతో విలేజ్ గేమ్స్ ఆడించారు. అఖిల్, భాగ్యశ్రీ కూడా అంతే జోష్ తో ఆడారు. అలాగే సోషల్ మీడియాలో అఖిల్ కి నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ ని కూడా చూపించి చదివింది శ్రీముఖి. "అన్నా మీకు క్రికెట్ అంటే ఎందుకు అంత ఇష్టం. వెనుక ఏమైనా స్టోరీ ఉందా ? క్రికెట్ లో మీ ఫేవరేట్ ప్లేయర్ ఎవరు "? అని అడిగారు. దానికి అఖిలో ఆన్సర్ ఇచ్చారు. "చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే పిచ్చి. నా ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ " అని చెప్పారు.
" ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఒక మూవీ చేశారు కదా.. అలా మీరు చేయాలి అనుకుంటే ఏ మూవీ చేస్తారు. ఎవరితో చేస్తారు ? " అని అడిగారు. "నేను రామ్ చరణ్ తోనే చేస్తాను." అన్నారు. ఐతే "బయట ఫాన్స్ ఏమంటున్నారంటే రాంచరణ్ కి రంగస్థలం ఎలాగో అఖిల్ కి లెనిన్ అలాగా అంటున్నారు " అని చెప్పింది శ్రీముఖి. "రంగస్థలం నా ఫేవరేట్ మూవీ. అలా కంపేర్ చేయడం ఇష్టం లేదు కానీ కాంప్లిమెంట్ గా తీసుకుంటాను " అని చెప్పారు. "రామ్ చరణ్, అఖిల్ గారి కంబినేషన్ ఎప్పుడు చూస్తామో తెలీదు" అనేసరికి "త్వరలో చూస్తారు " అన్నారు అఖిల్. ఐతే ఇక్కడ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కూడా చెప్పాలి. "తారక్ గారి వాయిస్ ఓవర్ గురించి " అంది శ్రీముఖి. "నేను అడిగిన వెంటనే తమ్ముడి కోసం నేను ఏదన్న చేస్తాను అనే మాట అన్నారు. వెంటనే ఆయన వాయిస్ ఇచ్చారు. డ్రమాటిక్ గా చెప్పాలంటే ఒక టైగర్ మా కోసం థియేటర్స్ కి వచ్చి గాండ్రించింది అని చెప్పొచ్చు. ఆయన ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలీడం లేదు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇదంటే ఒక ఒక్క కాల్ తో జరిగింది. ఒక ఫ్రెష్ యాంగిల్ ఇచ్చారు ఆయన ఈ మూవీ. థాంక్యూ టైగర్ " అంటూ చెప్పారు ఎన్టీఆర్ గురించి.
" తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా రీమేక్ చేయాలి అంటే ఏ సినిమాను రీమేక్ చేస్తారు ? " అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు అఖిల్. "పోకిరి అంటే నాకు పిచ్చి. వాడే పండుగాడు అనే డైలాగ్ ఇష్టం. " అని చెప్పారు. "ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. చిరంజీవి గారు అంటే మీకు చాలా అభిమానం అని తెలుసు. ఆయన మూవీస్ లో ఏదన్న రీమేక్ చేయాలి అంటే ఏది చేస్తారు " అని శ్రీముఖి అడిగింది. "అందరివాడు నాకు బాగా ఇష్టం. " చేస్తాను.
"చిరంజీవి గారు లెనిన్ మూవీ చూసాక ట్వీట్ చేశారు. మీరు పెదనాన్న అని పిలిచారు. అంటే జనరల్ గా అలా పిలుస్తారా లేకపోతె ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాం " bఅని అడిగింది శ్రీముఖి. "ఎనిమిదేళ్ల క్రితం ఇదంతా రాంచరణ్ వల్లనే అయ్యింది. నేను ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే గడిపేవాడిని ఎప్పుడు షూటింగ్ ఐపోయినా. ఈ విషయం ఎవరికీ తెలీదు. రాంచరణ్ వల్ల నేను వాళ్లందరికీ బాగా క్లోజ్ అయ్యాను. వాళ్లంతా కూడా నన్ను వాళ్ళ కొడుకులాగే భావిస్తారు. నిజంగా మా నాన్నను కలిసినట్టే ఫీలవుతాను " అంటూ చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు అఖిల్ .
" అన్న మీరు సిసింద్రీ మూవీ చేశారు కదా ? ఆ సినిమాను ఇప్పటికీ చూస్తారా ?చూసినప్పుడు మీకు ఎం అనిపిస్తుంది ? అని అడిగారు. "ఈ మధ్య కాలంలో చూడలేదు. నేను పెరిగే వయసులో రోజూ చూసేవాడిని. 7 , 8 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రతీ వీకెండ్ లో ఫ్రెండ్స్ తో కలిసి సిసింద్రీ మూవీ పెట్టుకుని చూసేవాళ్ళం. నాన్న ఒక పాయింట్ లో వచ్చి అరేయ్ నీ సినిమాను అన్ని సార్లు చూడకూడదు " అనేవారు. ఇలా ఆన్సర్స్ చెప్తూ బుల్లితెర స్టార్స్ తో కలిసి బొంగరం తిప్పారు, టైర్ ఆట ఆడారు, కర్రాబిళ్ళా కొట్టారు, గోళీలాట ఆడారు, కర్రసాము చేసి వాసి వాడి తస్సాదియ్యా అంటూ స్టేజి మీద దుమ్ము రేపారు అఖిల్.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అఖిల్ అక్కినేని, రాంచరణ్ కంబినేషన్ మూవీ త్వరలోనే.!
Jul 19, 2026 12:06PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




