Home

»

Tv News

BiggBoss 10 Telugu:ఫ్యామిలీ వీక్‌లో రామ్ ప్రసాద్‌కు తల్లి వార్నింగ్.. దేబ్జానీకి తండ్రి హింట్!

Nov 13, 2026 9:20AM

బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ చాలా కీలకం. బయట నుంచి ఆట చూసి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ మాటల్లో చాలా లోతైన అర్థాలు ఉంటాయి. గురువారం ఎపిసోడ్‌లో రామ్ ప్రసాద్ తల్లి, కూతురు, దేబ్జానీ పేరెంట్స్, సుధీర్ తల్లి వచ్చారు. ఇన్నాళ్లూ గందరగోళంగా ఉన్న హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఒక్కసారిగా ప్రశాంతత తీసుకొచ్చింది.

హౌస్‌లో స్కూల్ టాస్క్ జరుగుతుండగా రామ్ ప్రసాద్ తల్లి బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అయ్యి కిచెన్‌లో టీ పెట్టి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలా ఆడుతున్నానని అడగగా.. బాగా ఆడుతున్నావ్, కానీ ఈ మధ్య కాస్త తగ్గింది. నీకు కన్నింగ్ అని పేరు పెట్టడం బాధగా ఉందని చెప్పింది ఆదిలక్ష్మి. గట్టిగా ఆడు, మాట్లాడాల్సిన చోట గట్టిగా మాట్లాడమని చెప్పుకొచ్చింది. తర్వాత కూతురు ఉజ్వల ఎంట్రీ ఇచ్చి అందరితో ఆడిపాడింది. వెళ్తూ వెళ్తూ వాళ్లు వెళ్లిపోతారని ఇతరులతో చర్చించకని రామ్ ప్రసాద్ వాళ్ళ అమ్మ అతనితో చెప్పింది. 

ఆ తర్వాత దేబ్జానీ పేరెంట్స్ వచ్చారు. త్రిగుణ్ అంటే త్రిమూర్తి, అందర్నీ కంట్రోల్ చేస్తాడు, నీ ఆట వేరేగా ఉందని పొగిడారు దేబ్జానీ తండ్రి. ఇన్‌డైరెక్ట్‌గా విన్నర్ రేస్‌లో నువ్వే ముందున్నావ్ అని హింట్ ఇచ్చారు. నరేష్.. నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని సరదాగా చెప్పి ఫుల్ ఫన్ చేశాడు. నీ దుర్గ రూపం చూపించు, ఆటపైనే ధ్యాసపెట్టు, త్రిగుణ్‌తో మంచిగా ఉండు అని హింట్‌లు ఇచ్చారు. కలకత్తా స్వీట్స్, పాన్‌లు అందరికీ పంచి వెళ్లారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com