.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో దీపావళి స్పెషల్ సండే ఫండేగా సాగింది. అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జునకు ఇంటి సభ్యులు సర్ ప్రైజ్ ఇచ్చారు. నీతూ, శ్వేత జంటగా హాల్లో, త్రిగుణ్, వర్షిణి, అమన్ మష్రూం గదిలో, దేబ్జానీ, నరేష్, రాంప్రసాద్ గార్డెన్ ఏరియాలో, శివ, వంశీ మరో చోట డ్యాన్స్ చేసి నాగ్ కు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత దేబ్జానీ, ముకేష్ ఇష్యూకి క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. శివ్ తన చుట్టూ తిరుగుతున్నాడని అనడం తనకు నచ్చలేదని దేబ్జానీ అంటే, నల్ల కోతి అని కలర్ ఉద్దేశించి దేబ్జానీ అనడం తప్పు కదా అని ముఖేష్ అన్నాడు. వీడియో ప్లే చేసి చూపించిన నాగార్జున.. కావాలని దేబ్జానీ అనలేదు.. కానీ అనడం తప్పే.. నువ్వు కూడా అలా అనడం తప్పే.. ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకోండి అని చెప్పాడు. దీంతో ఇద్దరూ సారీ చెప్పుకుని కలిసిపోయారు. ఆ తర్వాత ముఖేష్ సేఫ్ అని నాగార్జున చెప్పాడు.
ఆ తర్వాత నో పాజ్ ఓన్లీ ఆన్సర్ అనే టాస్కులో ముఖేష్ టీమ్ గెలిచింది. దేబ్జానీ, అమన్, సుధీర్ ఇలా అందరూ ప్రతీ సారి టాస్కులో ఫెయిల్ అయ్యారు. చివరకు ముఖేష్ టీమ్ విన్ అయ్యింది. ఆ తర్వాత నరేష్, రామ్ ప్రసాద్ సేఫ్ అని చెప్పాడు నాగ్. బీబీ సినిమా అని మరో టాస్క్ పెట్టాడు నాగార్జున. ఇందులో ముందుగా వర్షిణి వచ్చి.. దేబ్జానీ గురించి చెప్తూ ఫేస్ ఒకటి.. వర్షెన్స్ ఎన్నో అని చెప్పింది. అందరితో బాండింగ్ లోపల ప్లానింగ్ అని త్రిగుణ్ గురించి శివ్ చెప్పాడు. మాటలు తోపు.. ఆటలు ఫ్లాప్ అని ఆర్కే గురించి నరేష్ చెప్పాడు. ఫస్ట్ వీక్ ఫైర్, నెక్ట్స్ వీక్ ఎక్స్ పైర్ అని నీతూ గురించి వంశీ చెప్పాడు. ఆర్కే వచ్చి నీతూ గురించి చెప్తూ బిల్డప్ కొండంత.. పర్ఫామెన్స్ గోరంత అని అన్నాడు. అది నీకు కూడా సెట్ అవుతుందని ఆర్కేకి నాగ్ కౌంటర్లు వేశాడు. సుధీర్ వచ్చి ప్రజెన్స్, పర్పస్ అని వర్షిణి గురించి చెప్పాడు. తేనే పూసిన కత్తి అని త్రిగుణ్ గురించి నీతూ చెప్పింది. కెమెరా కోసం అని శివ్ గురించి శ్వేత అంది. సినిమా లేని పోస్టర్ అని ఆర్కే గురించి రాంప్రసాద్, అమన్ అన్నారు. ఈ టాస్క్ తర్వాత వర్షిణి సేఫ్ అయ్యింది.
చివరగా దీపావళి స్పెషల్ కావడంతో ఈ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించాడు నాగార్జున. 10 మంది నామినేషన్స్ లో ఉన్నా ఎవరూ బయటకు వెళ్లరని చెప్పడంతో అందరూ సంబరాలు చేసుకున్నారు. అయితే నరేష్ కోసం హౌస్ మేట్స్ త్యాగం చేశారు. నరేష్ కు ఫ్యామిలీ వీక్ దక్కేలా నాగ్ టాస్కులు పెట్టి ఆడించాడు. ముకేష్ తన కెప్టెన్సీని, ఇమ్యూనిటీని త్యాగం చేసి నో ఎలిమినేషన్ కు కారణమయ్యాడని కూడా టాక్ నడుస్తోంది. దీంతో వర్షిణి, వంశీ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డారు.




.webp)
