![]()
హీరోలకే కాదు, సినిమాల్లో హీరోలు ఉపయోగించే ఆయుధాలకు కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. అప్పటి బాణాలు, గదలు దగ్గర నుంచి.. ఇప్పటి కత్తులు, గొడ్డళ్లు, గన్స్ వరకు.. హీరో వెపన్ పడితే బాక్సాఫీస్ షేకే. మరి అలా బాక్సాఫీస్ ని షేక్ చేసిన.. కొన్ని ఐకానిక్ వెపన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కర్రసాము, కత్తిసాము నేపథ్యంలో ఎక్కువగా ఫైట్స్ ఉండేవి. అయితే ఆయుధానికి హీరోయిజం తీసుకొచ్చింది మాత్రం.. అన్నగారు ఎన్టీఆర్. పౌరాణిక, జానపద సినిమాల్లో ఎన్టీఆర్ గద పట్టుకున్నా, విల్లు పట్టుకున్నా.. థియేటర్లలో పూనకాలు వచ్చేవి. ఎన్టీఆర్ అంటే.. గదలు, బాణాలే అనుకుంటే పొరపాటే. వేటగాడు, బొబ్బిలిపులి లాంటి సినిమాల్లో గన్స్ తో కూడా గూస్ బంప్స్ తెప్పించారు.
ఇక ఆయుధాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న గ్రేట్ యాక్టర్.. కత్తి కాంతారావు. ఆయన అసలు పేరు.. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. ఎన్నో జానపద సినిమాల్లో హీరోగా నటించి.. కత్తి ఫైట్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి.. 'కత్తి కాంతారావు'గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.
అప్పట్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో కృష్ణ ఏం చేసినా ట్రెండే. 'గూఢచారి 116', 'మోసగాళ్ళకు మోసగాడు' సినిమాలతో టాలీవుడ్‌కి గన్స్ ని పరిచయం చేశారు. అలాగే, 'అల్లూరి సీతారామరాజు'గా ఆయన విల్లు పడితే.. వెండితెర పూనకాలతో ఊగిపోయింది.
గన్స్, కత్తులే కాదు.. సైకిల్ చైన్ ని కూడా వెపన్ గా వాడొచ్చని చూపించిన మూవీ 'శివ'. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ గా పరిచయమైన ఈ సినిమాలో.. నాగార్జున సైకిల్ చైన్ పట్టుకొని ఫైట్ చేస్తే, ఒక్క రికార్డు కూడా మిగల్లేదు.
ఇక 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' చిత్రాలతో.. ఫ్యాక్షన్ సినిమాలలో బెంచ్ మార్క్ ను సెట్ చేసిన బాలకృష్ణ.. గొడ్డలి పట్టుకొని టాలీవుడ్ హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదు చేశారు. ఆ గొడ్డలి సెంటిమెంట్ ను తర్వాత కూడా కంటిన్యూ చేశారు బాలయ్య . సింహ, లెజెండ్ వంటి సినిమాల్లో స్పెషల్ గా డిజైన్ చేసిన గొడ్డళ్లతో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. 'గ్యాంగ్ లీడర్'లో గన్ పట్టినా, 'ఇంద్ర'లో కత్తి పట్టినా.. ఆయన దెబ్బకి రికార్డులన్నీ ఔటే. వెంకీ మామ ఏమైనా తక్కువా. 'లక్ష్మి', 'తులసి' సినిమాల్లో స్పెషల్ గా డిజైన్ చేసిన కత్తులతో ఊచకోత కోశారు.
టాలీవుడ్‌లో వెపన్ ఎలివేషన్‌కి కొత్త డెఫినిషన్ ఇచ్చిన డైరెక్టర్ అంటే.. రాజమౌళి అని చెప్పొచ్చు. 'సింహాద్రి'లో జూనియర్ ఎన్టీఆర్ పట్టుకున్న గొడ్డలైతే.. టాలీవుడ్ హిస్టరీలోనే బెస్ట్ వెపన్స్ లో ఒకటి. ఆ గొడ్డలితో తారక్.. రికార్డులన్నీ అడ్డంగా నరికేశారు.
'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'మగధీర', 'ఆర్ఆర్ఆర్'.. ఇలా ప్రతి సినిమాలోనూ తన మార్క్ ఆయుధంతో రికార్డులు సృష్టించారు రాజమౌళి.
ఈ జనరేషన్ లో గన్ అంటే గుర్తుకొచ్చేది.. పవన్ కళ్యాణ్. జల్సా, పంజా, గబ్బర్ సింగ్, ఓజీ.. ఇలా ఎన్నో సినిమాల్లో గన్స్ తో బాక్సాఫీస్ కి తన పవర్ చూపించారు.
మహేష్ బాబుకి కూడా గన్స్ అంటే భలే ఇష్టం. అతడు, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాల్లో గన్స్ తో మ్యాజిక్ చేశారు.
"కత్తి వాడటం మొదలుపెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు" అంటూ.. 'బాహుబలి'లో రాజసం చూపించినా, 'సలార్'లో రౌద్రం చూపించినా అది ప్రభాస్ కే చెల్లింది. 'బిల్లా', 'సాహో', 'సలార్' లాంటి సినిమాల్లో.. గన్స్ కూడా అదే రేంజ్ లో వాడారు మన డార్లింగ్.
ఇక 'మగధీర'గా కత్తి పట్టినా, 'అల్లూరి'గా విల్లు పట్టినా.. బాక్సాఫీస్ లెక్కలు సరిచేయడంలో రామ్ చరణ్ తర్వాతే ఎవరైనా.
అల్లు అర్జున్ ఏమైనా తక్కువా. గొడ్డలి, గన్, త్రిశూలం.. ఇలా ఎన్నో ఆయుధాలతో 'తగ్గేదేలే' అంటూ తిరుగులేని రికార్డులు సృష్టించారు.
అలా సీనియర్ ఎన్టీఆర్ గద నుండి.. నాగార్జున సైకిల్ చైన్ మీదుగా.. నేటి కత్తులు, గన్స్ వరకు.. టాలీవుడ్ హీరోల ఆయుధాలు మారుతూ వచ్చాయి.
[Tollywood, Iconic Weapons, NT RamaRao, Chiranjeevi, Nandamuri Balakrishna, Nagarjuna, Jr NTR, Pawan Kalyan, Telugu Film News]






