Home

»

Exclusive Movie News

తెలుగు సినిమాల్లో మ్యాజిక్ చేసిన ఐకానిక్ బైక్స్, హీరోల సాహ‌సాలు.!

Aug 28, 2026 7:17PM

తెలుగు సినిమాలో హీరోల ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్స్ లేదా రొమాంటిక్ ట్రాక్స్ పండాలంటే స్టైలిష్,  పవర్ ఫుల్ బైక్‌లు ఉండాల్సిందే. కేవలం ప్రయాణ సాధనాలుగానే కాకుండా, పాత్ర స్వభావాన్ని, మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేసే ముఖ్యాంశాలుగా ఇవి మారాయి. దశాబ్దాలుగా వెండితెరపై ప్రత్యేక ముద్ర వేసిన ఐకానిక్ బైక్స్‌, వాటి వెనుక ఉన్న ఆసక్తికర కథనాలు ఇవే.

80లు మరియు 90ల కాలంలో యమహా, బుల్లెట్ వంటి బైక్‌లు టాలీవుడ్‌లో సరికొత్త వైబ్ తీసుకొచ్చాయి. నిన్నే పెళ్లాడ‌తా చిత్రంలో నాగార్జున బైక్ రేస్‌లో పార్టిసిపేట్ చేసి రేసింగ్‌పై ప్రేక్ష‌కుల్లో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశారు. 
అంత‌కుముందు 1978లో విడుద‌లైన సాహ‌స‌వంతుడు చిత్రంలో ఎన్టీఆర్ బైక్ రేస‌ర్‌గా క‌నిపిస్తారు. దాని కోసం డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించే ఓ బైక్‌ను డిజైన్ చేశారు. ఎన్టీఆర్ ఆ బైక్‌తోనే రేస్‌లో పాల్గొంటారు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బైక్ డాన్సులు, ఛేజింగ్‌లు ఎప్పుడూ ప్రత్యేకం. 'గ్యాంగ్ లీడర్', 'స్టేట్ రౌడీ' చిత్రాల్లోని మోటార్ బైక్ స్టంట్లు మాస్ ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. 

మారుతున్న కాలానికి అనుగుణంగా టాలీవుడ్‌లోకి సూపర్ బైక్స్ హ‌వా మొదలైంది. రామ్ చరణ్ 'మగధీర' చిత్రంలో స్పోర్ట్స్ బైక్ రేసింగ్ సీన్స్ అప్పట్లో సరికొత్త హంగులను పరిచయం చేశాయి. అలాగే పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల' సినిమాలో ఉపయోగించిన కస్టమైజ్డ్ బుల్లెట్ బైక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ లెజెండ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ వాడిన హ్య‌ర్లీ డేవిడ్‌స‌న్ బైక్ ఒక ఎస్సెట్‌గా నిలిచింది.  

మరోవైపు అక్కినేని నాగచైతన్య, ఎన్టీఆర్ వంటి హీరోలకు రియల్ లైఫ్‌లో లగ్జ‌రీ స్పోర్ట్స్ బైక్స్ అంటే విపరీతమైన మోజు. వారు నటించిన సినిమాల్లో కూడా ఆ రేసింగ్ ఐడెంటిటీ స్పష్టంగా కనిపిస్తుంటుంది. సినిమా ఎంత హిట్టయిందో, ఆయా చిత్రాల్లో హీరోలు వాడిన బైక్స్‌ కూడా అంతే స్థాయిలో పాపులర్ అయ్యాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com