Home

»

Exclusive Movie News

నా మొగుడికి వంట చేసి పెడతావా?  రోజాపై ఫైర్ అయిన నాంచారి.!

Sep 18, 2026 5:57PM

తెలుగు సినిమా చరిత్రలో విక్టరీ వెంకటేష్, మీనా కాంబినేషన్‌లో వచ్చిన 'సుందరకాండ' చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్‌లో నాంచారిగా మీనా అభినయం, ఆమె అమాయకత్వం ప్రేక్షకుల మనస్సులలో చెరగని ముద్ర వేసాయి. ముఖ్యంగా భర్త వెంకటేశ్వర్లు ముందు మంచి భార్యగా నిరూపించుకోవడానికి నాంచారి పడే తాపత్రయం, ఆ క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు నేటికీ ప్రతి ఒక్కరినీ నవ్విస్తూనే ఉంటాయి.

కథలోని ఈ సరదా ఘట్టంలోకి వెళ్తే, నాంచారికి వంట చేయడం అస్సలు రాదు. అంతేకాకుండా ఆమె కేవలం ఐదో తరగతి వరకే చదువుకుంది. తన భర్త బాగా చదువుకున్న, సమర్థవంతంగా వంటలు తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని తెలిసి నాంచారి తీవ్రమైన కంగారుకు గురవుతుంది. తన అమాయకత్వంతో భర్త ఎక్కడ అప్సెట్ అవుతాడోనన్న భయంతో పక్కింటి శేషమ్మ పిన్నిగారి వద్దకు పరుగెడుతుంది. ఉదయాన్నే ఆరింటికి భర్త అడిగే నెస్కాఫే కాఫీ నుంచి, వేడివేడిగా కోరే సేమియా ఉప్మా వరకు అంతా పిన్నిగారే వండి పెడుతుంది. నాంచారి ఎస్కేప్ కాఫీ, సేమియా ఉప్మా గండాలను ఎలాగోలా దాటవేసి భర్త మెప్పు పొందుతుంది.

అయితే అసలు పరీక్ష ఆ తర్వాతే మొదలవుతుంది. నాంచారి భర్త తన ఆఫీస్ స్టాఫ్ 15 నుండి 18 మందికి లంచ్ ఇస్తానని చెప్పి చికెన్ బిర్యానీ, చికెన్ కుర్మా, చికెన్ కర్రీ వంటి రుచికరమైన వంటకాలు సిద్ధం చేయమని భార్యకు పురమాయిస్తాడు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పిన్నిగారు నాన్-వెజ్ వండ‌లేర‌ని తెలిసి నాంచారికి ఏమి చేయాలో దిక్కుతోచదు. ఈ క్లిష్ట సమయంలో పక్కింటి అమ్మాయి రోజా హోటల్ నుండి చికెన్ బిర్యానీ కొనుగోలు చేసి పంపించి నాంచారమ్మ పరువును కాపాడుతుంది. అది తిన్న ఆఫీస్ స్టాఫ్ అంతా వంట అమృతంలా ఉందంటూ మెచ్చుకోవడంతో, భర్త సంతోషపడి నాంచారమ్మకు కొత్త చీర, మల్లెపూలు బహుమతిగా ఇస్తాడు.

కానీ, ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవదు. తన భర్తకు పక్కింటి రోజా వంట చేసి పంపిందని నాంచారికి తెలిశాక, ఆమెలోని అనుమానం, ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటాయి. ఒక ఆడదానికి ఇంకో ఆడదాని మొగుడికి వంట చేసి పెట్టే హక్కు లేదని, దాని వెనుక ఏదో కిరికిరి ఉండి తీరుతుందని ఆగ్రహంతో రోజాపై విరుచుకుపడుతుంది. నా మొగుడు ఎర్రగా, బుర్రగా జబర్దస్త్‌గా ఉన్నాడని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా అంటూ రోజాపై కేకలు వేస్తుంది.

అయితే, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన ఒక నిజం నాంచారి హృదయాన్ని ద్రవీభవింపజేస్తుంది. గతంలో నాంచారి అనాధగా వచ్చినప్పుడు, రోజా తన మెడలోని బంగారు గొలుసును తీసి ఇచ్చి, నాంచారిని తన సొంత అక్కగా భావించిందని పిన్నిగారు చెప్తారు. ఈ నిజం తెలుసుకున్న నాంచారి తన తొందరపాటుతనానికి క్షమాపణలు కోరుతూ, రోజాను కౌగిలించుకుని సొంత చెల్లిలా స్వీకరిస్తుంది. రోజా కూడా నాంచారికి రెండు రోజుల్లో వంట నేర్పిస్తానని మాట ఇస్తుంది. హాస్యం, అనుబంధం కలగలిసిన ఈ సుందరకాండ కామెడీ సీన్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ ప్రియమైన జ్ఞాపకం. ఇలాంటి అపురూప‌మైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

 


[Sundarakanda Comedy Scenes, Venkatesh Meena Sundarakanda, Nancharamma Comedy Scenes, Telugu Classic Movie Scenes, Venkatesh Sundarakanda Movie, Meena Telugu Movie Comedy]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com