
తెలుగులో స్నేహబంధం నేపథ్యంతో వచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో కింగ్ నాగార్జున, సుమంత్ హీరోలుగా నటించిన 'స్నేహమంటే ఇదేరా' (Snehamante Idera) చిత్రం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాలో కేవలం ఎమోషన్స్ మాత్రమే కాదు.. బ్రహ్మానందం, సుధాకర్ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.
సుధాకర్ ఆటో సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. రైల్వే స్టేషన్ లో ఆటోలో లగేజ్ పెట్టి, ఎగ్గేలోపే అది మూవ్ అవుతుంది. దీంతో ఇంటి వరకు ఆటో వెనక పరుగెడుతూ వస్తాడు. అయినా ఆటో డ్రైవర్ డబ్బులు అడుగుతాడు. "నేను ఆటో ఎక్కితేనే కదా" అని సుధాకర్ అంటే, "మీరు ఎక్కకపోయినా మీ లగేజ్ ఎక్కింది కదా, డబ్బులు ఇవ్వాల్సిందే" అని డ్రైవర్ అనడం ఫన్నీగా ఉంటుంది.
ఇక సినిమాలో మరో హైలైట్ 'వాస్తా చేవల' అనే పదం. నాగార్జున తన ప్రేమను వ్యక్తపరచడానికి ఉపయోగించే ఈ కోడ్ లాంగ్వేజ్ (రివర్స్ చేస్తే 'లవ్ చేస్తావా') సుధాకర్ వెర్షన్‌లో వింటే నవ్వు ఆగదు. ముఖ్యంగా సుధాకర్ తనదైన శైలిలో దీన్ని పలికే విధానం థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించింది.
నాగార్జున 'వాస్తా చేవల' అంటూ బస్టాప్ లో కొందరు అమ్మాయిల్ని ఆట పట్టిస్తాడు. అయితే వాళ్ళు తన చెల్లెలి ఫ్రెండ్స్ అని తెలిసి.. అక్కడి నుండి జంప్ అవుతాడు. దీనిపై నాగార్జున చెల్లెలు ఇంట్లో పంచాయితీ పెట్టగా.. సుమంత్ ను అడ్డుపెట్టుకొని సుధాకర్ మేటర్ డైవర్ట్ చేయడం నవ్వులు పూయిస్తుంది.
ఈ వీడియోలో అసలైన హైలైట్ బ్రహ్మానందం-సుధాకర్ మధ్య వచ్చే సీన్. సుధాకర్ నిద్రలో తను సిమ్రాన్ తో డ్యాన్స్ చేస్తున్నట్లు కల గంటాడు. ఆ తర్వాత షకీలాతో రొమాన్స్ చేస్తున్నట్లు కలగనడం హైలైట్. ఆ సమయంలో బ్రహ్మానందం వచ్చి ఒక తన్ను తన్నడంతో.. సుధాకర్ మంచం మీద నుంచి కింద పడతాడు. నిద్ర మత్తులో ఉన్న సుధాకర్ "అయ్యయ్యో షకీలా, నేను లోయలో పడిపోయాం.. కాపాడండి.. కాపాడండి" అని అరవడం సినిమాలోనే ది బెస్ట్ కామెడీ సీన్లలో ఒకటి. సుధాకర్, బ్రహ్మానందం మధ్య జరిగే డైలాగ్ వార్, ముఖ్యంగా టీ పెట్టమని బ్రహ్మీ ఆటపట్టించే సీన్స్ అదిరిపోతాయి.
'స్నేహమంటే ఇదేరా' వంటి సినిమాలు కేవలం కథ కోసమే కాదు, ఇలాంటి ఆణిముత్యాల్లాంటి కామెడీ సీన్ల కోసం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నేటి బిజీ లైఫ్‌లో కాసేపు హాయిగా నవ్వుకోవడానికి బ్రహ్మానందం, సుధాకర్ కాంబినేషన్ ఒక చక్కని వినోదం.
ఇలాంటి మరిన్ని అద్భుతమైన సన్నివేశాలు, సినిమాల కోసం తెలుగు వన్ (TeluguOne) ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.




