Home

»

Exclusive Movie News

పాకిస్థానీ తీవ్రవాదిని ఒక ఆట ఆడుకున్న ఫేక్ పోలీస్.!

Jul 4, 2026 5:58PM

టాలీవుడ్ లో దేశభక్తి నేపథ్యంతో వచ్చిన చిత్రాల్లో దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన 'ఖడ్గం' (Khadgam) ఒక సంచలనం. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని రగిలించిన చిత్రమిది. ఈ సినిమాలో రవితేజ (Ravi Teja), శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా ఈ చిత్రంలోని ఒక పవర్‌ఫుల్ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సినిమాలో రవితేజ ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా ఉంటూ, ఎలాగైనా యాక్టర్ కావాలనే కలతో కనిపిస్తారు. ఒక సందర్భంలో పోలీస్ డ్రెస్ వేసుకుని తన మిత్రుడు అంజాద్ భాయ్ (ప్రకాష్ రాజ్) ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో ఇంటిముందు ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, నగరంలో విధ్వంసం సృష్టించడానికి వచ్చిన పాకిస్తానీ తీవ్రవాది అజర్ (షఫీ).

పోలీస్ గెటప్‌లో ఉన్న రవితేజ, ఆ తీవ్రవాదిని కాలర్ పట్టుకుని నిలదీసే సీన్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించింది. "ఎవరురా నువ్వు? నిన్ను చూస్తుంటే ఇండియా వాడిలా లేవే.. పాకిస్తానా, అఫ్ఘానిస్తానా?" అంటూ రవితేజ తన మార్క్ యాక్టింగ్‌తో విరుచుకుపడతాడు. భయంతో వణికిపోతున్న తీవ్రవాదిని చూసి, "బొక్కలో పెట్టి థర్డ్ డిగ్రీ యూస్ చేశానంటే అన్నీ బయటపడతాయి" అని రవితేజ చెప్పే డైలాగ్స్ అద్భుతం.

రవితేజను నిజమైన పోలీస్ అని భావించిన షఫీ.. తన టెర్రరిస్ట్ గుట్టు బయటపడిందన్న భయంతో.. బ్లేడ్ తో గొంతుకోసి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. 

సరిగ్గా అదే సమయంలో అక్కడికి అంజాద్ భాయ్ (ప్రకాష్ రాజ్) వస్తాడు. దాంతో సీన్ కామెడీ టర్న్ తీసుకుంటుంది. తన తమ్ముడు టెర్రరిస్ట్ అని తెలియని ప్రకాష్ రాజ్.. రవితేజకు షఫీని పరిచయం చేస్తుంటాడు. "ఇన్ని రోజులు దుబాయ్ లో ఉన్నాడట. ఇన్నాళ్లకు ఇంటికి తిరిగొచ్చాడు." చెబుతుంటాడు. అప్పుడు రవితేజ "ఆల్రెడీ నా యాక్టింగ్ తో షాక్ ఇచ్చాను." అని చెప్పి నవ్వులు పూయిస్తాడు.

ఈ సీన్ లో రవితేజ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అమోఘం. తీవ్రవాది పాత్రలో షఫీ చూపించిన హావభావాలు, భయం నిజంగానే ఆ పాత్రకు ప్రాణం పోశాయి. అలాగే ప్రకాష్ రాజ్ తనదైన నటనతో ఈ సీన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం ఈ ఒక్క సీన్ చూస్తేనే దర్శకుడు కృష్ణవంశీ మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే ప్రతిభ ఏంటో అర్థమవుతుంది.

ఈ ఐకానిక్ సీన్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అప్పట్లో థియేటర్లలో ఈ సీన్ చూసి రోమాలు నిక్కబొడుచుకున్నాయని, రవితేజ నటనకు ఈ సినిమా ఒక కేరాఫ్ అడ్రస్ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ని ఏళ్లు గడిచినా 'ఖడ్గం' సినిమాలోని ఈ పవర్‌ఫుల్ సీన్స్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.

 

 

Khadgam Movie, Ravi Teja, Prakash Raj, Krishna Vamsi, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com