Home

»

Exclusive Movie News

గెంటేసిన చోటుకే కలెక్టర్‌గా వచ్చిన భార్య.. కానిస్టేబుల్ భర్త రియాక్షన్ చూశారా?

Jul 1, 2026 9:37AM

టాలీవుడ్ లో భార్యాభర్తల బంధాలు, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా చిత్రం 'పోలీస్ భార్య' (Police Bharya). నరేష్, సీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ఒక కీలకమైన సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతాన్ని గుర్తుచేస్తూ, ప్రేక్షకుల హృదయాలను పిండేస్తున్న ఈ ఎమోషనల్ సీన్ సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలుస్తుంది.

ఈ వైరల్ వీడియో కథనంలోకి వెళ్తే, ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొని, ఇల్లు వదిలి వెళ్లిన ఒక సాధారణ మహిళ.. పట్టుదలతో చదివి కలెక్టర్‌గా తిరిగి వస్తుంది. ఆ జిల్లాలోనే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె భర్త, కొత్తగా వచ్చిన కలెక్టర్ మరెవరో కాదు, తన భార్యే అని తెలుసుకునే ఆ క్షణం అద్భుతమైన నటనతో సాగుతుంది. ఆఫీస్ రూమ్‌లోకి అడుగుపెట్టిన భర్తకు, కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన భార్యను చూసి మాటలు రావు. కలెక్టర్ అయినా కూడా ఏమాత్రం గర్వం చూపించకుండా, తన భర్త కాళ్లకు దణ్ణం ఆశీర్వాదం తీసుకుంటుంది.

తన భార్య ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకుందని తెలుసుకుని ఆ భర్త కళ్లల్లో ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి కనిపిస్తాయి. "కొత్త కలెక్టర్ అంటే ఎవరో అనుకున్నాను సీత.. నువ్వని తెలిసి ఉంటే ఊరంతా తెలిసేలా బ్రహ్మాండంగా ఊరేగింపు చేసేవాడిని" అంటూ నరేష్ చెప్పే డైలాగులు ఎంతో హృదయానికి హత్తుకుంటాయి. ఉత్తరం ముక్క కూడా రాయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావంటూ ఆయన పడే ఆరాటం ఆ పాత్రలోని లోతును చూపిస్తుంది.

అయితే, కలెక్టర్ సీట్లో ఉన్న సీత మాత్రం తన వ్యక్తిగత భావోద్వేగాలను అణచుకుని, వృత్తిధర్మానికి కట్టుబడి కనిపిస్తుంది. ఆఫీస్ వాతావరణంలో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని, ఏమైనా ఉంటే సాయంత్రం బంగళాకు వచ్చి మాట్లాడాలని గంభీరంగా చెబుతుంది. కానీ, లోలోపల భర్తపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని ఆమె మాటలు, చేతలు ప్రతిబింబిస్తాయి. ఆయనకు మంచి నీళ్లు ఇప్పించాలనే ఆరాటంలో ఒక భార్యగా ఆమె ప్రేమ కనిపిస్తుంది.

సీనియర్ నటుడు నరేష్ తన అద్భుతమైన హావభావాలతో, కానిస్టేబుల్ భర్తగా పడే ఆవేదనను, ఆనందాన్ని తెరపై పండించారు. అలాగే సీత కూడా కలెక్టర్ హోదాకు తగ్గ గంభీరత్వాన్ని, భార్యగా మనసులోని ప్రేమాభిమానాలను కళ్లతోనే పలికించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ ఇద్దరి నటన ఈ సీన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి.

యూట్యూబ్‌లో ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. "అప్పటి సినిమాల్లో ఉండే కథలు, భావోద్వేగాలు వేరు.. ఇప్పుడు ఇలాంటి సినిమాలు రావడం లేదు" అంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. భార్యను ఉన్నత స్థానంలో చూసి గర్వపడే భర్త, హోదా వచ్చినా భర్తను గౌరవించే భార్య.. ఈ ఇద్దరి బంధం ఎప్పటికీ ఆదర్శమేనంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com