Home

»

Exclusive Movie News

రాజ్‌క‌పూర్ ‘ఆవారా’ కంటే ఎన్టీఆర్ ‘మంచి మనిషి’ గొప్ప సినిమా.. ఎందుకంటే?

May 28, 2026 12:06PM

తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎన్నో చిత్రాలు వెండితెరపై అద్భుతాలు సృష్టించాయి. అందులోనూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన చిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దేవుడి పాత్రలతో కోట్లాది మంది గుండెల్లో కొలువైన ఎన్టీఆర్, ఒక దొంగ పాత్రలో నటించి, ఆ సినిమాకు ‘మంచి మనిషి’ అనే టైటిల్ పెడితే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు? సరిగ్గా 62 సంవత్సరాల క్రితం విడుదలైన 'మంచి మనిషి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడమే కాకుండా, ఇప్పటికీ ఎవ‌ర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

హిందీలో రాజ్‌క‌పూర్  నటించిన ‘ఆవారా’ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ‘నేరస్తుడి కొడుకు నేరస్తుడే అవుతాడా?’ అనే పాయింట్ చుట్టూ ఆ సినిమా తిరుగుతుంది. అయితే ‘ఆవారా’ చిత్రంలో ప్రేక్షకులను వేధించిన ఒక ముఖ్యమైన ప్రశ్నకు, తెలుగు ‘మంచి మనిషి’ చిత్రంలో రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి అద్భుతమైన ముగింపునిచ్చారు. తండ్రిపై పగతో కొడుకు జీవితాన్ని నాశనం చేసిన విలన్ పాత్ర (మిక్కిలినేని), క్లైమాక్స్‌లో తన తప్పు తెలుసుకుని రియలైజ్ అవ్వడం ఈ చిత్రంలోని అతిపెద్ద హైలైట్. హాలీవుడ్ ప్రసిద్ధ రచయిత ఓ హెన్రీ రాసిన షార్ట్ స్టోరీ ఇన్‌స్పిరేష‌న్‌తో పినిశెట్టి ఈ కథను అద్భుతంగా మలిచారు. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఒక ఎత్తయితే, గజదొంగ అయిన వేణు పాత్రలో ఆయన పండించిన మానవత్వం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ముఖ్యంగా ఒక పార్టీలో పోలీస్ ఆఫీసర్ కూతురు ఆటోమేటిక్ లాకర్‌లో ఇరుక్కుపోయినప్పుడు, ఆ పాపను కాపాడటం కోసం తను దొంగ అని తెలిసిపోయినా లెక్కచేయకుండా ఎన్టీఆర్ లాకర్‌ను ఓపెన్ చేసే సన్నివేశం సినిమాకే హైలైట్. తను ప్రేమిస్తున్న జమున ముందే రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా, ఒక పాప ప్రాణం ముఖ్యమని భావించే ఆ పాత్రలోని హ్యూమానిటీయే ఈ చిత్రానికి ‘మంచి మనిషి’ అనే టైటిల్‌ను వంద శాతం జస్టిఫై చేసింది. ఈ సీన్ స్ఫూర్తితోనే తర్వాతి కాలంలో కృష్ణ నటించిన ‘మామ అల్లుళ్ల సవాల్’ చిత్రంలో కూడా ఒక సీన్ డిజైన్ చేయడం విశేషం.

ఈ క్లాసిక్ మూవీ వెనుక మరికొన్ని అరుదైన విశేషాలు ఉన్నాయి. ప్రముఖ విలన్ త్యాగరాజుకి నటుడిగా ఇదే మొదటి సినిమా. అలాగే ప్రముఖ కామెడీ నటుడు పద్మనాభం తండ్రిగా రమణా రెడ్డి కేవలం ఫోటో ఫ్రేమ్‌లలోనే కనిపిస్తూ విభిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వించడం అప్పట్లోనే ఒక సరికొత్త ప్రయోగం. ఇదే టెక్నిక్‌ను తర్వాత కాలంలో ‘మగమహారాజు’ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర కోసం వాడుకున్నారు. అప్పటివరకు కేవలం ఏఎన్నార్‌తోనే ఎక్కువ సినిమాలు చేసిన ప్రముఖ దర్శకుడు కె. ప్రత్యగాత్మ, ఎన్టీఆర్‌తో చేసిన మొదటి సినిమా కూడా ఇదే. తర్వాతి కాలంలో ఆయన కుమారుడు కె. వాసు కూడా ఎన్టీఆర్‌తో సినిమా చేయడం ద్వారా, తండ్రీకొడుకుల దర్శకత్వంలో నటించిన అరుదైన రికార్డును ఎన్టీఆర్ ఖాతాలో వేసింది ఈ చిత్రమే. ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com