
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'డ్రాగన్'. ఈ సినిమా అనౌన్స్మెంట్ గ్లిమ్స్ విడుదలైనప్పటి నుండి అటు నందమూరి అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో 'డ్రాగన్' సినిమా సరికొత్త షూటింగ్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ప్రశాంత్ నీల్ అత్యంత కీలకమైన నైట్ షూట్స్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం అక్కడ ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సాధారణంగా ప్రశాంత్ నీల్ అనగానే మనకు కేజీఎఫ్, సలార్ లాంటి డార్క్ షేడ్ సినిమాలు గుర్తొస్తాయి. దాంతో రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూటింగ్స్ జరుగుతున్నాయనే వార్త రాగానే, ఈ సినిమా కూడా అదే తరహా డార్క్ థీమ్‌లో ఉండబోతోందా అని అభిమానులు అనుకున్నారు. అయితే ఇండస్ట్రీ ఇన్‌సైడర్ల టాక్ ప్రకారం.. ఇది కేవలం ఒక నైట్ షెడ్యూల్ మాత్రమే, లోపల భారీ సెట్స్ వేసి ఈ సీన్లు తీస్తున్నారు కాబట్టి పగలు రాత్రి అనే తేడా లేకుండా సినిమా టోన్ సరికొత్తగా ఉండబోతోంది.
ప్రశాంత్ నీల్ గత చిత్రాల లాంటి డార్క్ షేడ్ ఈ సినిమాలో ఉండదని, ఇదొక సరికొత్త కలర్ టోన్‌తో విజువల్ వండర్‌గా రాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుత నైట్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రుక్మిణి వసంత మధ్య కొన్ని ఎమోషనల్ అండ్ రొమాంటిక్ సీన్స్‌ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా కథా నేపథ్యం గురించి టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 'డ్రాగన్' కేవలం ఒక సాధారణ మాఫియా కథ కాదు. ఇదొక అంతర్జాతీయ డ్రగ్ వార్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 'గోల్డెన్ ట్రయాంగిల్' డ్రగ్ క్యారిడార్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, దాదాపు 4 నుండి 5 దేశాల మధ్య జరిగే డ్రగ్ సిండికేట్ ఘర్షణల నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అత్యంత ఎమోషనల్‌గా, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు వినికిడి.
ఇలాంటి గ్లోబల్ యాక్షన్ కంటెంట్ నార్త్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అవుతుంది. గతంలో ప్రభాస్ 'సాహో', అల్లు అర్జున్ 'పుష్ప 1' చిత్రాలు తెలుగులో ఆశించిన స్థాయి టాక్ రాకపోయినా, హిందీ బెల్ట్‌లో ఎలాంటి భారీ కలెక్షన్లు సాధించాయో మనకు తెలిసిందే. ఎన్టీఆర్ సైతం తన గత చిత్రాలు 'వార్ 2', 'దేవర' ఆశించిన స్థాయిలో హిందీ మార్కెట్‌లో పెర్ఫార్మ్ చేయకపోవడంతో, ఆ పెయిన్స్ నుంచి బయటపడటానికి ఈ 'డ్రాగన్' సినిమాను ఒక పవర్‌ఫుల్ ఆయుధంగా భావిస్తున్నారు. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Dragon Movie, Jr NTR, Rukmini Vasanth, Prashanth Neel




