తెలుగు సినీ ప్రేక్షకులకు హాస్యాన్ని మందులా పంచిన నటులలో ఎం.ఎస్. నారాయణ, ఎల్.బి. శ్రీరామ్ కాంబినేషన్ ఉందంటే అక్కడ నవ్వుల పువ్వులు పూయాల్సిందే. తాజాగా వైరల్ అవుతున్న ఒక కామెడీ సీన్ లో ఈ ఇద్దరు దిగ్గజాలు తమ టైమింగ్ తో కడుపుబ్బ నవ్విస్తున్నారు. బార్ నేపథ్యంలో సాగే ఈ సీన్ లో ‘కూల్ బాస్’ గా ఎల్.బి. శ్రీరామ్ నటన హైలైట్ అని చెప్పాలి.
ఈ సీన్ లో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఎల్.బి. శ్రీరామ్ కి ఎవరైతే కోపం తెప్పిస్తారో, వారి బార్ బిల్లు మొత్తం ఆయనే కడతానని మాట ఇస్తాడు. దాంతో ఎం.ఎస్. నారాయణ మరియు అతని స్నేహితులు ఆయన్ని కోపానికి గురి చేసేందుకు నానా తంటాలు పడతారు. తిట్టినా, అవమానించినా, చివరికి పచ్చి మిరపకాయలు తినిపించినా ఎల్.బి. శ్రీరామ్ తన ‘కూల్’ అవతారాన్ని వీడకపోవడం ప్రేక్షకులకు అసలు సిసలైన వినోదాన్ని ఇస్తుంది.
మద్యం సేవించడం, భార్య మందు దాచిపెడితే ఏం చేస్తాడు? వంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాలు ఒక ఎత్తు అయితే, పచ్చి మిరపకాయలు తిన్న తర్వాత వచ్చే రియాక్షన్స్ మరో ఎత్తు. చివరికి ఆ కారం వల్ల వచ్చే అరుపును ‘కోపం’ గా మార్చేసి, ఆయనతో బిల్లు కట్టించడంలో ఎం.ఎస్. నారాయణ సక్సెస్ అవుతారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు "ఇలాంటి సహజమైన కామెడీ ఇప్పుడు కరువైంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో ఈ ఇద్దరి నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు. మళ్ళీ ఇలాంటి ప్యూర్ కామెడీని ఎంజాయ్ చేయాలంటే ఈ వీడియోని తప్పక చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని కామెడీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribeచేసుకోండి.





