
టాలీవుడ్ సినిమా హిస్టరీలో ఎన్నో కామెడీ కాంబినేషన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. కానీ కొన్ని కాంబినేషన్లు మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. అలాంటి ఒక అదిరిపోయే పాత తరం కామెడీ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. కోవై సరళ తన మార్క్ నటనతో, రఘుబాబును ఆటాడుకునే ఈ కామెడీ సీన్స్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి.
'ఓరి నీ ప్రేమ బంగారం కాను' సినిమాలో రఘుబాబు, కోవై సరళ మధ్య వచ్చే సన్నివేశాలు అప్పట్లో థియేటర్లలో నవ్వుల పూలు పూయించాయి. కట్నం కోసం భార్యను వేధించే భర్త పాత్రలో రఘుబాబు నటన అద్భుతం. భార్య గంగ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బెల్టుతో కొడుతూ కట్నం డబ్బుల కోసం వేధించే సీన్‌తో ఈ కామెడీ ట్రాక్ ఊపందుకుంటుంది.
భార్యను కొట్టి పుట్టింటికి పంపించిన రఘుబాబుకు.. ఆమె స్థానంలో వచ్చిన మరదలు మంగ (కోవై సరళ) అసలైన సినిమా చూపిస్తుంది. అక్క కాపురాన్ని చక్కదిద్దడానికి వచ్చిన మంగ.. తన కంచు కంఠంతో రఘుబాబు పాలు విరిగిపోయేలా చేస్తుంది. "కలలో కాళికాదేవి వచ్చి వరం ఇచ్చింది.. ఈలేస్తే వేయి ఏనుగుల బలం వస్తుంది" అంటూ కోవై సరళ వేసే ఈలలు, ఆ తర్వాత రఘుబాబు పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి.
చివరకు తనతో ఆడుకుంటున్నది భార్య కాదు, చిన్నప్పుడే పారిపోయిన మరదలు మంగ అని రఘుబాబు తెలుసుకునే సీన్ హైలైట్. "నీ బాడీలో ఇంకా సాల్ట్ తగ్గలేదు.. ఒక్కసారి ఈల వేయనా" అని సరళ అనగానే, బాబోయ్ కట్నం వద్దు ఏమీ వద్దు నీ అక్కను పూల్లో పెట్టి చూసుకుంటా అని రఘుబాబు కాళ్లా వేళ్లా పడటం పీక్స్ అని చెప్పాలి. చివరిలో బ్రహ్మానందం ఎంట్రీతో వచ్చే ట్విస్ట్ సీన్ ఈ కామెడీ ట్రాక్‌ను మరింత రక్తి కట్టించింది.
Kovai Sarala, Raghu Babu, Comedy Scenes, TeluguOne





