Home

»

Exclusive Movie News

Bhagyaraj: పెళ్లిచూపుల ఇంటర్వ్యూ సీన్.. నవ్వులు పూయించిన భాగ్యరాజ్ క్లాసిక్ కామెడీ!

Jun 27, 2026 3:16PM

ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ (K Bhagyaraj) నేడు(జూన్ 27) గుండెపోటుతో కన్నుమూశారు. స్క్రీన్ ప్లే కింగ్ గా పేరు తెచ్చుకున్న భాగ్యరాజ్.. నటుడిగానూ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ‘పెళ్ళంటే ఇదేరా’ సినిమాలోని ఆయన కామెడీ సీన్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఎందరో స్టార్స్ నటించిన ‘పెళ్ళంటే ఇదేరా’ సినిమాలో భాగ్యరాజ్, ఊర్వశి ప్రత్యేక పాత్రల్లో  మెరిశారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని పెళ్లికొడుకు, పెళ్లికూతుళ్ల ఇంటర్వ్యూ ఎపిసోడ్ కేవలం హాస్యాన్ని మాత్రమే కాకుండా, మానవ నైజాలు, నాటి సమాజంలోని పెళ్లిళ్ల పోకడలను ఎంతో వ్యంగ్యంగా, సున్నితంగా ఆవిష్కరించింది. భాగ్యరాజ్ సహజ నటన, ఊర్వశి టైమింగ్ ఈ సీన్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లాయి.

ఈ వైరల్ వీడియోలో చూస్తే, పెళ్లిచూపుల కోసం వచ్చే ఒక్కొక్క అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసే విధానం, దానికి వారు ఇచ్చే సమాధానాలు వింటే ఇప్పటికీ కడుపుబ్బా నవ్వాల్సిందే. క్వశ్చన్ పేపర్ లీక్ చేసే బ్యాచ్ నుంచి, ఏమాత్రం ఇంగ్లీష్, తెలుగు రాని తమిళ అమ్మాయి వరకు ప్రతి ఒక్కరి పాత్రను ఎంతో వినోదాత్మకంగా మలిచారు. ఒకవైపు ఊర్వశి తనదైన చురుకైన డైలాగులతో కౌంటర్లు వేస్తుంటే, మరోవైపు భాగ్యరాజ్ తన సహజసిద్ధమైన శైలిలో ఇంటర్వ్యూను నడిపించే తీరు అద్భుతం.

ముఖ్యంగా ఈ సీన్ లో వచ్చే కొన్ని ఐకానిక్ డైలాగ్స్, ఉదాహరణకు "సూది కదలకపోతే దారం ఎక్కించలేం" అని కోర్టులో లాయర్ వాదించిన కేసు న్యాయమా అన్యాయమా అనే ప్రశ్న, అలాగే అమెరికా ప్రెసిడెంట్ క్లింటన్ వ్యవహారంపై అడిగే ప్రశ్నలు నాటి ట్రెండ్ కు తగ్గట్టుగా భలేగా పేలాయి. ఇక ప్రభుదేవా ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశానని చెప్పడంతో, ఇక తప్ప ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తారు.

చివరిగా వచ్చే తమిళ అమ్మాయి ఇంటర్వ్యూ ఎపిసోడ్ లో బాత్రూమ్ క్లీనింగ్ సీన్ తో ఇచ్చే ముగింపు హృదయాలను హత్తుకుంటూనే విపరీతమైన నవ్వులను పూయిస్తుంది.

ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ వీడియో మళ్లీ హల్ చల్ చేస్తోంది. భాగ్యరాజ్ లోని యాక్టింగ్ టాలెంట్ కు ఈ సీన్ ఒక నిలువెత్తు నిదర్శనం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com