పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు అంటే దొంగతనాలు, గొడవలు, నేరాలు.. ఇలాంటివే గుర్తుకొస్తాయి. కానీ బ్రహ్మానందం, ఏవీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఉంటే మాత్రం అక్కడ జరిగే విచారణలు కూడా కామెడీగా మారిపోతాయి. ఒకరు విచిత్రమైన ఫిర్యాదులతో పోలీసులను తలపట్టుకునేలా చేస్తే.. మరొకరు తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయిస్తారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సీనియర్ కమెడియన్ల మధ్య సాగే పోలీస్ స్టేషన్ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఊయల’ చిత్రంలోని కామెడీ సన్నివేశాలివి.
ఈ వీడియోలో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటున్న వ్యక్తిని కానిస్టేబుల్ అడ్డుకోవడంతో మొదలయ్యే గొడవ సరదాగా సాగుతుంది. తన పౌర హక్కులకు భంగం కలిగించారంటూ కానిస్టేబుల్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేయడం, చివరకు ఎస్ఐ ముందు విచారణ జరిగి కానిస్టేబుల్‌పైనే చర్యలు తీసుకునే పరిస్థితి రావడం నవ్విస్తుంది. మరో సన్నివేశంలో కళ్లలో లైట్ వేసి కళ్లు మంటలెక్కాయంటూ ఫిర్యాదు చేయడం, మధ్యలో వచ్చే ‘మూతి మనిషి’ డైలాగ్‌తో గందరగోళం మరింత పెరుగుతుంది.
ఇక పట్టపగలు నడిబజార్లో ఒంటి మీద ఉన్న చొక్కానే దొంగిలించారంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు మరో హైలైట్. దొంగతనం జరిగిన తీరు, దానికి సంబంధించిన వాదనలు చూస్తే నవ్వకుండా ఉండలేరు. బ్రహ్మానందం, ఏవీఎస్ తమదైన మాటలతో ఈ సన్నివేశాలను మరింత సరదాగా మార్చేస్తారు. చిన్న విషయాన్ని కూడా పెద్ద కేసుగా మార్చి పోలీసుల ముందుకు తీసుకురావడం ఈ కామెడీలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
అయితే ఈ వీడియోలో అసలైన హైలైట్ మాత్రం షాపులో జరిగిన దొంగతనం కేసు. పోయిన వస్తువుల జాబితా చెప్పే విధానం ఎస్ఐకి తలనొప్పి తెప్పిస్తుంది. ఎనిమిది బియ్యపు గింజలు, రెండు బస్తాల నూనె, ఐదు లీటర్ల సబ్బులు, రెండు పెసర గింజలు, మూడు మినప గింజలు.. ఇలా కిలోలు, లీటర్లు, బస్తాలు, గింజల లెక్కలతో ఫిర్యాదు సాగుతుంది. నాలుగు కిలోల కొబ్బరికాయలు, రెండు గంపల షాంపూ అంటూ చెప్పే వివరాలు పోలీస్ విచారణను పూర్తిగా కామెడీగా మార్చేస్తాయి. బ్రహ్మానందం, ఏవీఎస్, సుధాకర్, తనికెళ్ళ భరణిల కామెడీ టైమింగ్, విచిత్రమైన ఫిర్యాదులు కలిసిన ఈ సన్నివేశాలు పాత తెలుగు కామెడీని మళ్లీ గుర్తుచేస్తున్నాయి. ఇలాంటి ఫుల్ కామెడీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
[Brahmanandam, AVS, TeluguOldComedyScenes, TeluguComedyVideo, BrahmanandamPolice]





