Home

»

Exclusive Movie News

Brahmanandam: మిడిల్ క్లాస్ మొగుడి కష్టాలు.. బ్రహ్మానందం మార్క్ నవ్వుల జాతర!

Jun 3, 2026 12:13PM

తెలుగు సినిమా చరిత్రలో హాస్యానికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు బ్రహ్మానందం (Brahmanandam). ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయాల్సిందే. ముఖ్యంగా 90ల నాటి క్లాసిక్ కామెడీ సినిమాల్లో బ్రహ్మీ పండించిన నవ్వులు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. 

‘బ్రహ్మచారి మొగుడు’ (Brahmachari Mogudu) చిత్రంలో బ్రహ్మానందం, సీనియర్ నటి శ్రీలక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన హిలేరియస్ కామెడీ సీన్స్ అభిమానులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాలోని కామెడీ సీన్లు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి.

ఈ సినిమాలో బ్రహ్మానందం (గురునాథం), శ్రీలక్ష్మి (కామాక్షి) దంపతులుగా నటించారు. విపరీతమైన దైవభక్తి, నియమ నిబంధనలు పాటించే భార్య వల్ల ఒక మధ్యతరగతి భర్త పడే కష్టాలను ఎంతో నవ్వు తెప్పించేలా చిత్రీకరించారు. భార్య పూజ పూర్తయ్యే వరకు కాళ్ళు కదపకుండా బెడ్‌పైనే ఉండిపోవాల్సి రావడం, పాచి నోటితో పాయసం తాగమండం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.

మరో సీన్ లో భార్యను సినిమాకు తీసుకెళ్లే క్రమంలో రిక్షాలో వెళ్తుంటే.. దారిపొడవునా కూరగాయలు, ప్లాస్టిక్ బకెట్లు, చీపుర్లు కొంటూ భర్త జేబుకు చిల్లు పెట్టే కామాక్షి పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఒకతను బ్రహ్మానందాన్ని చూసి రిక్షా తొక్కేవాడు అనుకోవడం, ఆ సమయంలో బ్రహ్మీ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతం. 

అలాగే పూజ కోసం ఆవు నుండి నేరుగా బుట్టలోకి పేడ పట్టుకోవాలనే భార్య వింత కోరికను తీర్చడానికి బ్రహ్మానందం పడే తంటాలు నవ్వుల జాతరను తెప్పిస్తాయి.

ఈ పాత తెలుగు హాస్య సన్నివేశాలు ఇప్పటి డిజిటల్ యుగంలోనూ యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు "అప్పటి కామెడీనే అసలైన కామెడీ.. బ్రహ్మానందం గారి నటనకు సాటిలేదు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీకూ కాసేపు మనసారా నవ్వుకోవాలనిపిస్తే, తెలుగువన్ (TeluguOne) అందిస్తున్న ఈ బ్రహ్మానందం కామెడీ క్లిప్‌ను అస్సలు మిస్ అవ్వకండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com