Home

»

Exclusive Movie News

5 రూపాయలకే లీటర్ పెట్రోల్.. మామూలు ఆఫర్ కాదిది!

Jul 1, 2026 11:46AM

టాలీవుడ్ లో కడుపుబ్బా నవ్వించే క్లాసిక్ కామెడీ చిత్రాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాల్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన 'పేకాట పాపారావు' (Pekata Paparao) చిత్రం ఒకటి. వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో అలీ ట్రాక్ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. 

ఈ సినిమాలో అలీ చేసిన 'అబ్దుల్లా' పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ 20 రూపాయలు ఉన్న ఆ రోజుల్లో, కేవలం ఐదు రూపాయలకే పెట్రోల్ పోసే అబ్దుల్లా క్యారెక్టర్ థియేటర్లలో నవ్వుల పూయించింది.

ఈ వైరల్ వీడియోలో.. రాజేంద్ర ప్రసాద్, గుండు హనుమంతురావు బండి మీద వెళ్తుండగా పెట్రోల్ అయిపోతుంది. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, వెళదామని గుండు హనుమంతురావు అంటాడు. "మనకు ఐదు రూపాయలకే పెట్రోల్ పోసే అబ్దుల్లా గాడు ఉండగా.. 20 రూపాయిలు ఇచ్చి పెట్రోల్ బంక్ లో కొనడం ఏంటి?" అంటూ అలీ దగ్గరకు తీసుకెళ్తాడు రాజేంద్ర ప్రసాద్.

అక్కడ అలీ అచ్చమైన అరబిక్ మిక్స్డ్ తెలుగు భాషలో మాట్లాడే విధానం, "ఇది డైరెక్ట్ దుబాయ్ నుంచి వచ్చిన పెట్రోల్ గురు" అంటూ ఇచ్చే ఎలివేషన్లు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కల్తీ లేని ఒరిజినల్ పెట్రోల్ అంటూ అలీ చెప్పే డైలాగులు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ సీన్‌ను ఎవర్ గ్రీన్ కామెడీగా మార్చేశాయి. అయితే ఈ సీన్ వెనుక ఒక క్రేజీ ట్విస్ట్ అండ్ ఫన్నీ ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉంది.

అసలు అబ్దుల్లాకు ఆ పెట్రోల్ ఎలా వస్తుందనేది హిలేరియస్‌గా ఉంటుంది. ఆగి ఉన్న కార్లలో చిన్న పైప్ సాయంతో పెట్రోల్ మొత్తం పీల్చేసి, దానిని బాటిల్స్ లో నింపి అమ్ముతుంటాడు. అయితే ఒకసారి అబ్దుల్లా పెట్రోల్ బంక్ లో ఆగి ఉన్న కారు నుండి పెట్రోల్ కొట్టేస్తుండగా, పొరపాటున పెట్రోల్ తాగేస్తాడు. అది కాస్తా ఒంట్లోని బ్లడ్‌లో కలిసిపోవడంతో హాస్పిటల్ లో చేరతాడు. డాక్టర్ పరీక్షించి, "నీ రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు మారిపోయి పెట్రోల్ కణాలుగా తయారయ్యాయి. ఇక నుంచి నువ్వు యూరిన్ పోస్తే పెట్రోల్ వస్తుంది" అని డాక్టర్ చెప్పడం, దానికి అలీ 'శుక్రియా' అనడం ఇప్పటికీ మీమ్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

ప్రస్తుతం లీటర్ పెట్రోల్ సెంచరీ దాటేసిన ఈ రోజుల్లో, నాటి 'ఐదు రూపాయల పెట్రోల్' కామెడీ సీన్ చూసి నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. "ఆ రోజుల్లో పెట్రోల్ కి ఇరవై రూపాయలే ఎక్కువ అనుకున్నారు. ఈ రోజుల్లో అబ్దుల్లా లాంటి వాడు ఉంటే దేశమంతా లైన్ కట్టేవాళ్లు" అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com