Home

»

Exclusive Movie News

చరణ్ అన్న దేవుడిలా నా ప్రాణాలు కాపాడాడు.. అదుర్స్ రఘు ఎమోషనల్ కామెంట్స్!

May 16, 2026

సినిమాల్లో కనిపించే కామెడీ, ఫైట్లు వెండితెరపై చూసేందుకు ఎంతో సరదాగా అనిపించినప్పటికీ, వాటి వెనుక నటీనటులు పడే కష్టం, కొన్నిసార్లు ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదాలు అంత సులభంగా బయటకు తెలియవు. తాజాగా ప్రముఖ యాక్టర్ రఘు కారుమంచి (Raghu Karumanchi) తెలుగువన్ కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)తో తనకు ఉన్న ఒక మరువలేని అనుభవాన్ని, షూటింగ్ లొకేషన్‌లో చరణ్ తన ప్రాణాలను ఎలా కాపాడారో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ కేవలం రీల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో అని రఘు కారుమంచి ప్రశంసల వర్షం కురిపించారు.

రఘు కారుమంచి మాట్లాడుతూ.. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'గోవిందుడు అందరివాడేలే' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక భయంకరమైన ప్రమాదాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు, ఒక పెద్ద హెవీ వెయిట్ బాక్స్‌ను దించే ప్రాసెస్ జరుగుతోంది. ఆ బాక్స్ లోపల ఏమీ లేకపోయినా, ఆ బాక్స్ ఇట్ సెల్ఫ్ చాలా బరువుగా ఉంది. దాంతో నలుగురు వ్యక్తులు కలిసి ఆ బాక్స్‌ను పట్టుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల, మిగిలిన ముగ్గురు వ్యక్తులు దాన్ని చాలా తేలికగా తీసుకుని వదిలేశారు. దాంతో ఆ భారీ బాక్స్ బరువు మొత్తం ఒక్కసారిగా రఘు కారుమంచిపై పడిపోయింది. ఆ బరువుకు ఆయన కిందకు వంగిపోయి, ఊపిరి ఆడక విలవిలలాడిపోయారు.

లొకేషన్‌లో వందలాది మంది ఉన్నప్పటికీ రఘు పడుతున్న ఆ నరకాన్ని ఎవరూ గమనించలేదు, కానీ రామ్ చరణ్ మాత్రం దాన్ని వెంటనే నోటీస్ చేశారు. అక్కడ ఏదో తేడా జరిగిందని గ్రహించిన చరణ్, క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగున వచ్చి ఆ భారీ బాక్స్‌ను పక్కకు లాగేశారు. అప్పటికే రఘు కారుమంచి ఊపిరి ఆడక ఆల్మోస్ట్ అన్ కాన్షియస్ (స్పృహతప్పే) స్టేజ్‌కు వెళ్ళిపోయారు. "ఆ రోజు చరణ్ అన్న గనుక దేవుడిలా వచ్చి నన్ను కాపాడకపోయుంటే నా పరిస్థితి ఏమయ్యేదో.. నిజంగా థాంక్యూ చరణ్ అన్న" అంటూ రఘు కారుమంచి ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు.

అదే సినిమాలో నది మధ్యలో, రాళ్ల బ్యాక్‌డ్రాప్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు వరదలు వచ్చి యూనిట్ మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో కూడా చరణ్ అప్రమత్తమై నిర్మాత బండ్ల గణేష్‌ను, కెమెరామన్‌ను సురక్షితంగా తన బండిలో ఎక్కించుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్లారని రఘు తెలిపారు. కేవలం రెండు నిమిషాలు ఆలస్యమై ఉంటే కేదార్‌నాథ్ తరహాలో వాగు వచ్చి అందరూ కొట్టుకుపోయేవారని భయంకరమైన రోజూ గుర్తు చేసుకున్నారు. 

సినిమాల్లో రిస్క్ స్టంట్స్ చేయడం, చేజింగ్ సీన్లలో కార్ డ్రైవింగ్ చేయడం తనకు ప్యాషన్ అయినప్పటికీ, చరణ్ చేసిన సాయం మాత్రం జీవితంలో మరువలేనని రఘు కారుమంచి కొనియాడారు.

మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినిమా అప్డేట్స్ కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com