Home

»

Latest News

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లుక్ ఇదే..!

Mar 29, 2016 1:22PM

యమదొంగ, బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ లుక్స్ పరంగా స్టైలిష్ గా కనిపించిన సినిమాలు ఇవన్నీ. చివరిగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో తన లుక్స్ తో యూత్ లో కేక పుట్టించాడు తారక్. దీంతో తన తర్వాతి సినిమా జనతా గ్యారేజ్ లో యంగ్ టైగర్ ఏ లుక్ లో ఉంటాడో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్టు ఎన్టీఆర్ కొత్త లుక్స్ ట్రై చేస్తున్నాడంటూ వార్తలు రావడంతో ఆసక్తి మరింత పెరిగింది. కానీ ఆ మూవీ సెట్స్ లో ఫోటో చూస్తే, టైగర్ తన పాత లుక్స్ కే ఫిక్సయ్యాడని అర్ధమవుతోంది. సింహాద్రి, సాంబ సినిమాల్లో ఎలా ఉన్నాడో, అదే కర్లీ హెయిర్, గడ్డంతో ఊర మాస్ లుక్ లో ఎన్టీఆర్ దర్శనమిస్తున్నాడు. బహుశా ప్రయోగాలకు పోకుండా, కథతోనే క్రేజ్ క్రియేట్ చేద్దామనేది కొరటాల శివ ప్లాన్ కావచ్చు. మొదట రిలీజ్ చేసిన మోహన్ లాల్ లుక్ , లేటెస్ట్ గా లీక్ అయిన ఎన్టీఆర్ లుక్ దాదాపు ఒకేలా ఉండటం కొసమెరుపు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com