Home

»

Latest News

Tollywood: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ప్రముఖ తెలుగు హీరో మృతి!

May 10, 2026

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ హీరో భరత్ కాంత్(31) మృతిచెందారు. ఈ ఘటన బొంగులూరు గేట్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హీరో భరత్ కాంత్‌తో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. (Bharath Kanth)

భరత్ కాంత్ ఇటీవల విడుదలైన 'టాలెంట్' (Talent) సినిమాలో హీరోగా నటించి గుర్తింపు పొందారు. అంతే కాకుండా పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. మరోవైపు త్రిలోక్ పలు తెలుగు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి తమ సొంత ఊరైన నెల్లూరు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సినీ పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com