(1).webp)
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి హీరోగా నటించిన 'రొమాంటిక్' ఫిల్మ్ ఈ నెల 29న థియేటర్లలో విడుదలవుతోంది. పూరి స్వయంగా కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు రాసిన ఈ సినిమాతో ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకునిగా పరిచయమవుతున్నాడు. కేతికా శర్మ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ఈ మూవీలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా రమ్యకృష్ణ నటించారు.
సినిమాలో ఆమెది అత్యంత కీలకమైన పాత్ర అనీ, ఆమె రాకతో 'రొమాంటి'క్ రూపురేఖలు మారిపోయాయనీ యూనిట్ మొత్తం కోడై కూస్తోంది. తనకూ, కేతికకు ఈ సినిమా అవసరమైతే, సినిమాకు రమ్యకృష్ణగారు అవసరమంటూ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఆకాశ్ పూరి అన్నాడంటేనే ఆ పాత్రలో రమ్య నటన ఏ రేంజ్‌లో ఉండివుంటుందో ఊహించుకోవాల్సిందే.
'రొమాంటిక్'కు పూరి జగన్నాథ్‌తో పాటు నిర్మాతగా వ్యవహరించిన చార్మి కౌర్ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. సెట్స్‌పై తనతో పాటు మెయిన్ యూనిట్ మెంబర్స్‌తో రమ్యకృష్ణ ఉన్న ఫొటోలవి. సినిమా జాతకాన్నిమార్చేశారంటూ రమ్యను తెగ పొగిడేశారు.
(1).webp)
"నా డార్లింగ్, నా ఫేవరేట్ రమ్యకృష్ణకు అప్రిసియేషన్ పోస్ట్.. రొమాంటిక్‌ను చేస్తున్నందుకు, ఈ రోల్‌ను పోషించడంలో మీ అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించినందుకు థాంక్స్ చెప్పకుండా ఉండలేను. మన సినిమా జాతకాన్ని మీరు మార్చేశారు. లవ్ యు ఆల్వేస్." అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు చార్మి.
.webp)
ఫాన్స్ నుంచి ఈ పోస్ట్‌కు విపరీత స్పందన లభిస్తోంది. 'రొమాంటిక్' మూవీలో లవ్ బర్డ్స్ వాస్కోడిగామా, మోనికగా ఆకాశ్, కేతిక కనిపించనున్నారు.






