Home

»

Latest News

Yogibabu: యోగిబాబు సంచలన నిర్ణయం.. కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు 

Jun 22, 2026 3:07PM

 

హాస్య నటుడుగా చిత్ర పరిశ్రమని ఎలాలంటే అంత ఆషామాషీ కాదు. అందుకు ఎంతో టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ పుష్కలంగా ఉన్న నటుడు యోగిబాబు(Yogibabu). తమిళనాట మొదలైన తన ప్రభంజనం టోటల్ సౌత్ మొతానికి పాకింది. తను స్క్రీన్ పై కనపడటం ఆలస్యం ఒకటే విజిల్స్. అలాంటి  యోగిబాబు తాజాగా ఒక ఎమోషనల్ నిర్ణయంతో అందరి మనసులని  గెలుచుకున్నారు.


 సాధారణంగా నటులు తమ క్రేజ్,మార్కెట్ డిమాండ్‌ని  బట్టి భారీగా పారితోషికాలు డిమాండ్ చేస్తుంటారు. కానీ యోగిబాబు మాత్రం ఒక కొత్త మరియు కష్టాల్లో ఉన్న దర్శకుడి కోసం తన నిబద్ధతని  చాటుకుంటూ ఏకంగా సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. అర్జున్ దాస్, అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'కాన్ సిటీ' (Con City). హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో క్రైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కగా  ఈ నెల 26 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక శనివారం సాయంత్రం చెన్నైలో ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో పాల్గొన్న యోగిబాబు మాట్లాడుతు ఐదు సంవత్సరాలుగా  హరీష్ సినిమా అవకాశాల కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అతని శ్రమ, అంకితభావం చూసి అతను ఎలాగైనా దర్శకుడు కావాలని ఎప్పటి నుంచో కోరుకున్నానని ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా యోగిబాబు తను నటించిన చాలా సినిమాల ప్రమోషన్స్ లేదా ఈవెంట్లకు హాజరుకారనే టాక్ ఉంది. కానీ ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా చెన్నై ఈవెంట్‌కి విచ్చేశారు. దర్శకుడు హరీష్ గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం కోసమే, హరీష్‌ను దర్శకుడిగా నిలబెట్టడం కోసం యోగిబాబు తన రెగ్యులర్ మార్కెట్ పారితోషికంలో సగం మాత్రమే తీసుకుని ఈ చిత్రంలో నటించడం విశేషం.


Also read: cocktail 2: కాక్‌టెయిల్ 2 మూడు రోజుల ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే 

దర్శకుడు హరీష్ దురైరాజ్ మాట్లాడుతు  అసిస్టెంట్ డైరెక్టర్‌గా నెలకు కేవలం పదివేల రూపాయల జీతంతో ఉన్నప్పటి నుంచి నా భార్య నన్ను ఎంతో సపోర్ట్ చేసింది. 2020లో పెళ్లి చేసుకున్న తర్వాత ఐదేళ్ల పాటు ఆమె ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది.. ఇలాంటి కష్ట సమయంలో యోగిబాబు వంటి స్టార్ కమెడియన్ నాకుఅండగా నిలబడి, సగం రెమ్యునరేషన్ తీసుకొని మూవీ పూర్తి చేయడంలో సహాయపడటం మరచిపోలేనని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com