Home

»

Latest News

'టాక్సిక్' వివాదంపై విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన య‌శ్‌.!

Aug 16, 2026 10:48AM

'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యశ్, ప్రస్తుతం తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'టాక్సిక్' పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ సినిమాపై సోషల్ మీడియాలో కొన్ని తీవ్రమైన విమర్శలు గుప్పుమన్నాయి. ఈ మూవీలో అశ్లీలత, పురుషాధిక్య ధోరణి ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న ట్రోల్స్‌పై యశ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్య్వూలో యశ్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. బోర్డర్ దాటి అశ్లీలతను చూపించడాన్ని తాను ఎప్పుడూ సమర్థించనని స్పష్టం చేశారు. వెండితెరపై రొమాంటిక్ లేదా నైబర్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు పరిమితులు ఉంటాయని, వాటిని ఒక పద్ధతి ప్రకారం కళాత్మకంగానే ప్రెజెంట్ చేయాలని తాను నమ్ముతానని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, 'టాక్సిక్' కథాంశం గురించి చెబుతూ ఈ చిత్రం నేటితరం యంగ్ జనరేషన్ (జెన్-జీ) భావోద్వేగాల చుట్టూ తిరుగుతుందని వెల్లడించారు. పాతతరం ఆలోచనా విధానంతో ఇప్పటి కుర్రాళ్లు ఎలాంటి ఘర్షణకు లోనవుతున్నారో ఇందులో ఎమోషనల్‌గా చూపించబోతున్నారట. థియేటర్లలో బొమ్మ పడ్డాక ఇది పూర్తిగా యూత్ మెచ్చే చిత్రమని అందరికీ అర్థమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

లేడీ డైరెక్టర్ గ్రీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటోంది. 'కేజీఎఫ్ 2' వంటి సంచలన విజయం తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో నయనతార‌, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ వంటి అగ్ర కథానాయికలు కీలక పాత్రల్లో మెరవనుండటం విశేషం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల చర్చలు నడుస్తున్నప్పటికీ, యశ్ ఇచ్చిన స్పష్టతతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. యశ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ భారీ కాన్సెప్ట్ మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరి కేజీఎఫ్ రికార్డులను తిరగరాసేలా యశ్ ఈ సారి ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి!

 

Yash, Toxic Movie, Geethu Mohandas 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com