Home

»

Latest News

Prakash Raj: ప్రొడ్యూసర్ జేబులో డబ్బు కాజేసిన ప్రకాష్ రాజ్.. అగ్ర రచయిత వ్యాఖ్యలు వైరల్ 

Apr 18, 2026 11:34AM

 

-ప్రకాష్ రాజ్ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది 
-ప్రముఖ అగ్ర రచయిత సంచలన వ్యాఖ్యలు 
-ప్రకాష్ రాజ్ రెండు రోజుల క్రితం రాముడిని విమర్శించిన విషయం తెలిసిందే 
-పూర్తి మాటర్ ఏంటో చూద్దాం 

 
 స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్(Prakash Raj)రెండు రోజుల క్రితం హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు గురించి మాట్లాడుతు 'రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలు. వారిద్దరూ దక్షిణ భారతానికి చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారు. శూర్పణఖ ఆ దొంగతనాన్ని చూసి జిఎస్టితో కలుపుకొని రెండు వేల డాలర్స్ కట్టాలని అడిగిందనే వ్యాఖ్యలు చేసాడు. దీంతో ప్రకాష్ రాజ్ పై హిందువులు భగ్గుమంటున్నారు. అనేక చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ కి సంబంధించిన నిజాలు ఇవే అని స్టార్ రైటర్ మరుదూరి రాజా అంటున్నాడు. అవేంటో చూద్దాం.

ప్రకాష్ రాజ్ గారూ..ఇంత దిగజారి పోతారనుకోలేదు.. రచయిత గా బాధగా ఉంది.. మీకు నా ముందస్తు సానుభూతి.. రంగ మార్తాండా. మొదట మీరో ఆఫీసు బాయ్. ప్రొడ్యూసర్ జేబులో డబ్బు కాజేసి చెన్నైచేరి గొప్ప ఆర్టిస్ట్ అయ్యారు. మీలాగే శ్రీ రాముడు అనుకుంటే ఎలా.? మీ కథ మొత్తం నా దగ్గరుంది అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఈ పోస్ట్ చేరవలసిన వాళ్ల దగ్గరకే చేరుతుంది. అదేనండి రామ భక్తుల దగ్గరకి. దీంతో సోషల్ మీడియావేదికగా రామభక్తులందరు ప్రకాష్ రాజ్ రాజ్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు.


also read: Anchor Ravi: యాంకర్ రవి ఆవేదన.. మా కుల పెద్ద చిరంజీవి 

 
మరుదూరి రాజా గురించి చెప్పుకోవాలంటే రచయితగా ఒక పెను ప్రభంజనాన్నే సృష్టించాడు. ఆయన మేధో ఫలకం నుంచి వచ్చిన ఎన్నో డైలాగ్స్  నేటికీ సినీ ప్రియుల నోళ్లల్లో ఆణిముత్యాలుగా నిత్య స్పర్శతో ఉంటాయి.  దాదాపుగా 350 సినిమాలు ఆయన లిస్ట్ లో ఉండగా ఆల్ జోనర్స్ కి తన మాయాజాలంతో మరింత వన్నె తెచ్చాడు.

 

   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com