Home

»

Latest News

మారుతి నెక్స్ట్ మూవీ ఎవరితో? రైటర్ డార్లింగ్ స్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

May 25, 2026 2:57PM

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘డార్లింగ్’ (Darling). కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో రీ-రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ రచయిత డార్లింగ్ స్వామి (Darling Swamy) ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రీసెంట్ గా 'మేము కాపులం' వెబ్ సిరీస్ ఈవెంట్‌లో పాల్గొన్న డార్లింగ్ స్వామి.. ఈ సిరీస్ ద్వారా తన కొడుకు శశివర్ధన్ నటుడిగా పరిచయమవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 'తెలుగువన్ సినిమా'(TeluguOne Cinema)తో మాట్లాడిన ఆయన, 'డార్లింగ్' రీ-రిలీజ్ రికార్డులపై స్పందించారు. సుమారు 16 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో హిట్ అయినప్పటికీ, ఇప్పుడు రీ-రిలీజ్‌లో కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం ఒక అద్భుతమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఒక కొత్త సినిమా కాలక్రమేణా పాతదవుతుంది కానీ, 'డార్లింగ్' లాంటి క్లాసిక్ సినిమా మాత్రం పాతదైనా సరికొత్తగా కనిపిస్తోందని డార్లింగ్ స్వామి పేర్కొన్నారు. ఇప్పటి తరం యువత థియేటర్లలో ప్రతి డైలాగ్‌కు, సీన్‌కు అప్పట్లో కంటే అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో మంచు పడే సీన్, ఐస్ ఫైట్స్ వంటి విజువల్స్ దర్శకుడు కరుణాకరన్ అడ్వాన్స్‌డ్ ఆలోచనలకు నిదర్శనమని, ఆ రోజుల్లోనే ఆయన ఒక విజువల్ పోయెట్‌లా సిజి వర్క్‌తో ఈ మ్యాజిక్ క్రియేట్ చేశారని కొనియాడారు.

ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన నిజంగానే డార్లింగ్ అని అన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రభాస్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని, పైగా ఆయనలో మెచ్యూరిటీ మరింత పెరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరినీ గౌరవించే గుణం, ఎటువంటి వివాదాలు లేని మంచి మనసున్న వ్యక్తి ఆయన అని ప్రశంసించారు.

ప్రస్తుతం దర్శకుడు మారుతితో కలిసి తదుపరి స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. రాజా సాబ్ తర్వాత మారుతి చేయబోయే తదుపరి చిత్రం ఏ హీరోతో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, కథ సిద్ధమవుతోందని, త్వరలో ఆ ప్రాజెక్ట్ హీరో ఎవరనేది అధికారికంగా ఖరారవుతుందని డార్లింగ్ స్వామి స్పష్టం చేశారు. దీంతో పాటు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తున్న ఓ చిత్రానికి కూడా తాను కథ అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com