Home

»

Latest News

ఆ అమ్మ‌డికి కూడా అడివి శేష్ ప్ల‌స్స‌య్యేనా!

Jun 8, 2022 3:20PM

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ఈ త‌రం క‌థానాయ‌కుల్లో అడివి శేష్ ఒక‌రు. `క్ష‌ణం` (2016), `అమీ తుమీ` (2017), `గూఢ‌చారి` (2018), `ఎవ‌రు` (2019), `మేజ‌ర్` (2022).. ఇలా అడివి శేష్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే.. త్వ‌ర‌లో `హిట్ః ద సెకండ్ కేస్`తో ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు ఈ టాలెంటెడ్ హీరో. 2020 నాటి `హిట్ః ద ఫ‌స్ట్ కేస్`కి సీక్వెల్ గా రూపొందిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. జూలై 29న జ‌నం ముందుకు రానుంది. `హిట్ః ద ఫ‌స్ట్ కేస్`కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శైలేష్ కొల‌ను.. ఈ సీక్వెల్ ని కూడా రూపొందించాడు. నేచుర‌ల్ స్టార్ నాని ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించాడు.

ఇదిలా ఉంటే,  త‌న గ‌త చిత్రం `మేజ‌ర్`తో అప్ప‌టివ‌ర‌కు సాలిడ్ హిట్ లేని యువ క‌థానాయిక‌ స‌యీ మంజ్రేక‌ర్ కి ఫ‌స్ట్ స‌క్సెస్ అందించాడు అడివి శేష్. క‌ట్ చేస్తే.. `హిట్ః ద సెకండ్ కేస్`లోనూ ఇంత‌వ‌ర‌కు స‌రైన హిట్ లేని మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రి.. `ద‌బాంగ్ 3`(2019), `గ‌ని`(2022)తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూసిన స‌యీ మంజ్రేక‌ర్ కి మూడో చిత్రంతో అడివి శేష్ ఫ్యాక్ట‌ర్ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టే.. `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` (2021), `ఖిలాడి` (2022)తో రెండు వ‌రుస అప‌జ‌యాలు మూట‌గ‌ట్టుకున్న మీనాక్షికి కూడా మూడో సినిమా హీరో అడివి శేష్ హిట్ ఇస్తాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com