Home

»

Latest News

మెగాస్టార్, రాక్ స్టార్..  మ‌రో పొంగ‌ల్ హిట్ కొడ‌తారా!

Jul 2, 2022 4:23PM

మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌ల్లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. `శంక‌ర్ దాదా ఎంబీబీఎస్`(2004), `అంద‌రివాడు`(2005), `శంక‌ర్ దాదా జిందా బాద్`(2007), `ఖైదీ నంబ‌ర్ 150`(2017).. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు వీరి కాంబోలో నాలుగు చిత్రాలు రాగా అవ‌న్నీ మ్యూజిక‌ల్ గా మెప్పించాయి. `శంక‌ర్ దాదా ఎంబీబీఎస్`, `ఖైదీ నంబ‌ర్ 150` అయితే క‌మ‌ర్షియ‌ల్ గానూ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే, `ఖైదీ నంబ‌ర్ 150` త‌రువాత చిరు, దేవి శ్రీ ఇప్పుడు మ‌రోమారు జ‌ట్టుక‌ట్టారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. `మెగా 154` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చెన్నై పొన్ను శ్రుతి హాస‌న్ నాయిక‌గా న‌టిస్తుండ‌గా.. 2023 సంక్రాంతి స్పెష‌ల్ గా విడుద‌లకి ప్లాన్ చేశారు. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌యమేమిటంటే.. చిరు - దేవి శ్రీ ప్రీవియ‌స్ కాంబో మూవీ `ఖైదీ నంబ‌ర్ 150` కూడా సంక్రాంతి సీజ‌న్ లోనే విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. మ‌రి.. ఆరేళ్ళ త‌రువాత అదే పొంగ‌ల్ సీజ‌న్ లో రాబోతున్న చిరంజీవి - దేవి శ్రీ ప్ర‌సాద్ కాంబో.. ఇంకోసారి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com