Home

»

Latest News

తెలుగులో తన్నింది.. మరి తమిళంలో ??

Aug 2, 2016 10:50AM

ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గుతుందో అయినా చెప్పగలమేమో కానీ.. జనాలకు ఏ సినిమా ఎందుకు నచ్చుతుంది? అనే విషయాన్ని మాత్రం ఎవ్వరం నిర్ణయించలేం. అందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. తమిళంలో డిజాస్టర్ అయిన కార్తీ మొదటి సినిమా "యుగానికి ఒక్కడు" తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఇటీవల "బిచ్చగాడు" కూడా.. క్యాస్టింగ్ కాకుండా కేవలం కంటెంట్ తో రిలీజైన ఈ చిత్రం తెలుగులో ఆడదేమో అనుకొన్నారు. కట్ చేస్తే.. 20 కోట్లు వసూలు చేసి అందరి నోళ్ళు మూయించింది. 

ఇప్పుడు అలాంటి మ్యాజిక్కే మరోమారు రిపీటవుతుందేమోనన్న ఆశతో తెలుగులో ఫ్లాపయిన ఓ చిత్రాన్ని తమిళంలో ఈ వారం విడుదల చేస్తున్నారు. నటుడు ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం "కొరియర్ బోయ్ కళ్యాణ్". తెలుగులో నితిన్, తమిళంలో జై హీరోలుగా నటించిన ఈ చిత్రంలో యామిగౌతమ్ కథానాయిక. దర్శకనిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్మించిన ఈ చిత్రం దాదాపు రెండేళ్లపాటు చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. తెలుగులో గతేడాది సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రం కనీస స్థాయి వసూళ్లు సైతం రాబట్టుకోలేక ఫట్టుమంది. ఇప్పుడు ఈ చిత్రం తమిళ వెర్షన్ ను తమిళంలో ఆగస్ట్ 5న విడుదల చేస్తున్నారు. మరి తెలుగులో ఫ్లాపయిన ఈ చిత్రం తమిళంలో హిట్టవుతుందో లేక తెలుగులోవలే తమిళంలోనూ ఫ్లాప్ గా నిలుస్తుందో చూడాలి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com