Home

»

Latest News

అచ్చిరాని మార్చిలో.. ప్ర‌భాస్ మూడోసారైనా హిట్ కొడ‌తాడా!?

Mar 05, 2022

`పాన్ - ఇండియా స్టార్` ఇమేజ్ లో ప్ర‌భాస్ చేసిన తొలి రొమాంటిక్ మూవీ `రాధే శ్యామ్`. పిరియ‌డ్ ల‌వ్ సాగాగా రూపొందిన ఈ సినిమా కోసం బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేతో మొద‌టిసారిగా జ‌ట్టుక‌ట్టాడు ప్ర‌భాస్. విధికి, ప్రేమ‌కి మ‌ధ్య సాగే యుద్ధంగా `రాధే శ్యామ్`ని తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు `జిల్` రాధాకృష్ణ‌. కాగా, మార్చి 11న ఈ పాన్ - ఇండియా మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో మార్చి నెల వేదిక‌గా ప్ర‌భాస్ రెండు సార్లు జ‌నం ముందు నిలిచాడు. అయితే, రెండు సంద‌ర్భాల్లోనూ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకోలేక‌పోయాడు. 2003 మార్చిలో ప్ర‌భాస్ రెండో చిత్రంగా రిలీజైన `రాఘ‌వేంద్ర‌`, 2005 మార్చిలో ప్ర‌భాస్ ఐదో సినిమాగా విడుద‌లైన `చ‌క్రం` బాక్సాఫీస్ ని మెప్పించ‌లేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో.. `రాధే శ్యామ్`తోనైనా అచ్చిరాని మార్చిలో  నెగ‌టివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మ‌రీ ప్ర‌భాస్ విజ‌యం అందుకుంటాడేమో చూడాలి.

Also Read: మ‌రోసారి సంక్రాంతి బ‌రిలో చిరు!?

ఇదిలా ఉంటే, `రాధే శ్యామ్`లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు అతిథి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుండ‌గా.. భాగ్య‌శ్రీ‌, జ‌య‌రామ్, జ‌గ‌ప‌తి బాబు, రిద్దీ కుమార్, స‌చిన్ ఖేద్క‌ర్, ముర‌ళీ శ‌ర్మ‌, స‌త్య‌న్, ప్రియ‌ద‌ర్శి, కునాల్ రాయ్ క‌పూర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com