Home

»

Latest News

ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య ఎందుకు విడిపోయారు?

Jan 18, 2022

 

భార్య ఐశ్వ‌ర్య నుంచి విడిపోతున్న‌ట్లు కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ ప్ర‌క‌టించ‌గానే అత‌ని ఫ్యాన్స్‌, కోలీవుడ్‌తో పాటు దేశంలోని ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంతా షాక్‌కు గుర‌య్యింది. కార‌ణం.. ఇండ‌స్ట్రీలోని బెస్ట్ క‌పుల్స్‌లో ఒక‌టిగా ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య జంట పేరు తెచ్చుకుంది. అలాంటిది ఎలాంటి పొగ లేకుండా అక‌స్మాత్తుగా త‌మ వైవాహిక బంధానికి వారు స్వ‌స్తిచెప్ప‌డం ఎవ‌రికీ మింగుడుప‌డ‌లేదు. ఆ జంట విడిపోతుంద‌ని అభిమానులు ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య భార్యాభ‌ర్త‌లు మాత్ర‌మే కాదు, గుడ్ ఫ్రెండ్స్ కూడా. 

ఆ ఇద్ద‌రూ 2004 న‌వంబ‌ర్ 18న పెళ్లి చేసుకున్నారు. 2006లో పెద్ద కొడుకు యాత్ర‌, 2010లో రెండో కొడుకు లింగ పుట్టారు. ఒక‌సారి ఇంట‌ర్వ్యూలో ఐశ్వ‌ర్య మాట్లాడుతూ, తన త‌ల్లిదండ్రులు ర‌జ‌నీకాంత్, ల‌త చాలా సంప్ర‌దాయ‌వాదుల‌నీ, అందుకే ధ‌నుష్‌, త‌ను చెట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతున్నామంటూ మీడియాలో రావ‌డంతో త‌మ‌ పెళ్లిని హ‌డావిడిగా జ‌రిపించార‌నీ తెలిపింది. ఏమైనా ధ‌నుష్‌ను పెళ్లి చేసుకున్నందుకు త‌ను చాలా హ్యాపీగా ఉన్నాన‌ని చెప్పింది. నాన్న మ‌మ్మ‌ల్ని వెంట‌నే పెళ్లిచేసుకొన‌మ‌ని చెప్పారు. ధ‌నుష్‌, నేను ఎప్పుడూ డేటింగ్‌కు వెళ్ల‌లేదు. నాన్న సంప్ర‌దాయాల‌కు చాలా విలువ‌నిస్తారు. అది నేను అర్థం చేసుకున్నాను. అని ఆ ఇంట‌ర్వ్యూలో ఆమె చెప్పింది.

Also read: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య‌ ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో తెలుసా?

అయితే రెండో కొడుకు పుట్టిన కొద్ది కాలానికే ధ‌నుష్ పేరు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె శ్రుతి హాస‌న్‌తో క‌లిసి వినిపించింది. ఇది '3' సినిమా నిర్మాణంలో ఉన్న‌ప్పుడు జ‌రిగింది. ఆ సినిమాతో ఐశ్వ‌ర్య డైరెక్ట‌ర్‌గా మారింది. అందులో ధ‌నుష్ హీరోగా న‌టించ‌గా, త‌న చిన్న‌నాటి స్నేహితురాలు శ్రుతిని హీరోయిన్‌గా తీసుకుంది ఐశ్వ‌ర్య‌. ఆ సినిమా షూటింగ్‌లో ఉండ‌గా శ్రుతితో ధ‌నుష్ ఎఫైర్ పెట్టుకున్నాడంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఈ రూమ‌ర్స్ వ‌ల్ల ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయ‌ని కూడా వినిపించింది. అందులో ఎంత నిజ‌ముందో ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు తెలియ‌లేదు. ఏదేమైనా ఆ త‌ర్వాత కూడా ఆ జంట అన్యోన్యంగా ఉన్న‌ట్లే క‌నిపించింది. 

Also read: షాకింగ్.. హీరో ధనుష్‌, ఐశ్వర్య విడాకులు

ధ‌నుష్ త‌ర్వాత సిద్ధార్థ్‌, నాగ‌చైత‌న్య లాంటి వాళ్ల‌తో క‌లిసి శ్రుతి పేరు వినిపించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె శంత‌ను హ‌జారికాతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంది. ఇప్పుడు హ‌ఠాత్తుగా ఐశ్వ‌ర్య నుంచి త‌ను విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ధ‌నుష్‌.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com