సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తనదైన అల్లరితో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి. తెలుగులో సుధీర్ బాబు సరసన 'భలే మంచి రోజు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నదాన్ని అప్పట్లో మన ప్రేక్షకులు పెద్దగా గుర్తించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో పరాజయం అందుకోవడంతో వామికా తన మకాం బాలీవుడ్‌కు మార్చేసింది. అక్కడ వరుస క్రేజీ ఆఫర్లతో అదరగొడుతూ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయింది. కేవలం హిందీలోనే కాకుండా ఇప్పుడు పాన్-ఇండియా స్టార్‌గా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో అడివి శేష్ మోస్ట్ అవేటెడ్ స్పేస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'G2' (గూఢచారి 2) లో నటిస్తూ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. దీనితో పాటు తమిళంలో జీని, DC సినిమాలతో పాటు పలు క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు, వెబ్ సిరీస్‌లు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా వామికా గబ్బి చేసిన జపాన్ పర్యటన ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. జపాన్ వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ అత్యంత సాంప్రదాయకమైన సుమో రెజ్లింగ్‌లో పాల్గొంది. పాల్గొనడమే కాకుండా ఏకంగా విన్నర్‌గా కూడా నిలిచి అందరినీ షాక్‌కు గురిచేసింది. కొండలాంటి భారీ సుమో రెజ్లింగ్ వీరుణ్ణి వామికా ఓడించడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆమె గెలిచిన ట్రిక్ ఏంటో అస్సలు మిస్ అవ్వకుండా తెలుసుకోవాల్సిందే. మ్యాచ్ కోసం వామికా గాలితో నింపిన ఒక పెద్ద సుమో సూట్ వేసుకుని నేరుగా రింగ్‌లోకి దూకేసింది. మొదట రింగ్‌లోకి దిగి చాలా గంభీరంగా బిల్డప్ ఇస్తూ భారీ సుమో లాగే ఫోజులు ఇచ్చింది. ఆ తర్వాత అకస్మాత్తుగా నవ్వుతూ వెళ్లి ఆ సుమో రెజ్లర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి గట్టిగా హగ్ చేసుకుంది.
ఆ తర్వాత అసలు సిసలైన ఫైట్ మొదలైంది. ఎంత బలం ఉపయోగించి నెట్టినా ఆ కొండలాంటి రెజ్లర్ అంగుళం కూడా కదల్లేదు. సుమో బలముందు తన ఆటలు సాగవని గ్రహించిన వామికా వెంటనే రూట్ మార్చేసింది. అకస్మాత్తుగా తన కంటిలో ఏదో పడినట్టు విపరీతంగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది. పాపం ఆ భోళా సుమో రెజ్లర్ అది నిజమేనని నమ్మి, ఆమెకు హెల్ప్ చేద్దామని జాలితో దగ్గరకు వచ్చాడు. సరిగ్గా ఇదే సందు అనుకున్న వామికా.. అస్సలు ఊహించని విధంగా అతడిని ఒక్కసారిగా రింగ్ అవతలికి నెట్టేసి మ్యాచ్ గెలిచేసింది. ఈ నమ్మించి ముంచేసే ఫన్నీ విక్టరీ తర్వాత రింగ్‌లోనే ఆమె వేసిన క్రేజీ డ్యాన్స్ వీడియోకి అసలైన హైలైట్‌గా నిలిచింది.
ఇక ఈ ఫన్నీ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వామికా గబ్బి.. ఇలాంటి ట్రిక్స్‌తో మ్యాచ్‌లు ఎలా గెలవాలో తెలుసుకోవడానికి తన దగ్గర నోట్స్ తీసుకోవాలంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు సైతం వామికా వీడియోపై చాలా సరదాగా స్పందిస్తున్నారు. "అలాంటి అందమైన అమ్మాయి అడగాలే కానీ.. ఆమె కోసం ఎన్నిసార్లు అయినా ఓడిపోవడానికి సిద్ధం" అని ఒకరు కామెంట్ చేయగా, "చాలా బాగా బురిడీ కొట్టించి గెలిచావ్ వామికా" అంటూ ఇంకొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి వామికా చేసిన ఈ అల్లరి జపాన్ సుమోని కూడా ముంచేసి నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
Wamiqa Gabbi, G2 Movie Heroine, Wamiqa Gabbi Funny Video




