Home

»

Latest News

ర‌వితేజ‌ను న‌మ్ముకున్న స్టార్ డైరెక్ట‌ర్!!

Feb 26, 2019 3:57PM


                 

మాస్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో స్టార్ డైర‌క్ట‌ర్ వి.వి.వినాయ‌క్ స్టైలే వేరు. టాప్ హీరోలంద‌రితోనూ ఆయ‌న వ‌ర్క్ చేసారు. మంచి స‌క్సెస్ లు కూడా అందుకున్నారు.  మెగాస్టార్ రీ -ఎంట్రీ `ఖైదీ నెంబ‌ర్ 150` తర్వాత  ఆయ‌న మేనల్లుగు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో `ఇంటిలిజెంట్`  సినిమా చేశాడు .ఆ సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత ఇంత  వర‌కు ఏ సినిమా చేయ‌లేదు వినాయ‌క్. ఆ మ‌ధ్య బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ  కానీ ఆ సినిమా కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజాగా ర‌వితేజ‌తో ఓ సినిమా క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ర‌వితేజ స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం.  సి.క‌ళ్యాన్ నిర్మించ‌నున్న ఈ సినిమా జూలై లో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఈ సినిమాకు  సంబంధించి పూర్తి వివరాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్నాయి.  ప్ర‌స్తుతం ర‌వితేజ డిస్కో రాజా చిత్రంలో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమా తో ఎలాగైనా మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి రావాల‌న్న క‌సితో ఉన్నాడ‌ట ద‌ర్శ‌కుడు వినాయ‌క్‌. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో `కృష్ణ ` చిత్రం వ‌చ్చింది. ఈ సినిమా కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంది మంచి పేరు తీసుకొచ్చింది.  అయితే ఆ చిత్రానికి సీక్వ‌ల్ చేయ‌బోతున్నార‌నే వార్త కూడా అందుతోంది. చూద్దాం ఎలా ఉంటుందో మ‌రి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com