
కోలీవుడ్ స్టార్ సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వనాథ్ & సన్స్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టడం విశేషం.
ఈ చిత్రం వరల్డ్ వైడ్ నాన్-థియేట్రికల్ అండ్ థియేట్రికల్ హక్కుల రూపంలో ఏకంగా రూ. 215 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.125 కోట్లు రాగా, థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లు చేసింది. బిజినెస్ లెక్కల ప్రకారం.. విడుదలకు ముందే ఈ సినిమా వల్ల మేకర్స్ ఏకంగా రూ.85 కోట్ల లాభం వచ్చింది.
నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన విశ్వనాథ్ & సన్స్, బయ్యర్లకు కూడా లాభాలను తెచ్చి పెడుతుందేమో చూడాలి. రూ.90 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది కాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.90 కోట్లకు పైగా లేదా దాదాపు రూ.180 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Vishwanath And Sons, Business, Suriya, Venky Atluri, Naga Vamsi






