Home

»

Latest News

'మా' అసోసియేషన్‌ లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదు: మంచు విష్ణు

Sep 24, 2021 6:17PM

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ జరగనుంది. ప్రకాష్ రాజ్ ఒకడుగు ముందుండి ఎప్పుడో తన ప్యానల్ ని ప్రకటించగా.. గురువారం విష్ణు తన ప్యానల్ ని ప్రకటించారు. ఈరోజు(శుక్రవారం) తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

'మా' ప్రెసిడెంట్‌ అనేది ఒక బిరుదు కాదని, ఒక బాధ్యత అని విష్ణు అన్నారు. మా ఎన్నికలు ఇలా జరగడం పట్ల మేమెవరమూ సంతోషంగా లేమన్నారు. మా ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత పోటీ ఎప్పుడూ చూడలేదని.. మా మెంబర్స్ గ్రూపులుగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల గురిం‍చి మీడియా, సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధాకరమన్నారు. మాలో మార్పు తీసుకొస్తామని, ప్రతి ఒక్కరికి మెడికల్‌ ఇన్సురెన్స్‌ కల్పిస్తామని విష్ణు చెప్పారు.

మాలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్‌ కు ఉందని విష్ణు అన్నారు. మా బిల్డింగ్ ను  తన సొంత డబ్బులతో కడతానని చెప్పారు. తాను పదవి లో ఉన్నా లేకపోయినా సినిమా ఇండస్ట్రీ కోసం చివరి శ్వాస వరకు పని చేస్తానని అన్నారు. ప్రత్యర్థి ప్యానెల్‌లో మంచి నటులు ఉన్నారని.. ఒక నిర్మాతగా వాళ్లను తన సినిమాలో తీసుకుంటానని చెప్పారు. అయితే మా అసోసియేషన్‌ లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదని, వాళ్ల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసని విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com