
వైవిధ్యానికి పెట్టింది పేరు.. లోక నాయకుడు కమల్ హాసన్. ఎలాంటి పాత్రలోనైనా జీవించే ఈ విలక్షణ నటుడు.. త్వరలో `విక్రమ్`గా పలకరించబోతున్నారు. `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ వంటి సూపర్ టాలెంటెడ్ స్టార్స్ కూడా సందడి చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న `విక్రమ్`.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. కమల్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది నవంబర్ 7న టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. 2 నిమిషాల 22 సెకండ్ల పాటు సాగిన ఈ టైటిల్ టీజర్ ని లోకేశ్ తీర్చిదిద్దిన విధానం సినీ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. 26 కోట్ల మందికి పైగా వీక్షకులను ఆకట్టుకున్న ఈ టైటిల్ టీజర్ కి కమల్ ప్రజెన్స్, అనిరుధ్ నేపథ్యసంగీతం ప్రధానబలంగా నిలిచాయి. కట్ చేస్తే.. ఈ సంవత్సరం కమల్ బర్త్ డేకి కూడా స్పెషల్ విజువల్ ట్రీట్ ఇవ్వనుందట `విక్రమ్` యూనిట్. ఇందులో భాగంగా ఈ సారి నవంబర్ 7న టీజర్ ని ప్లాన్ చేశారట. అంతేకాదు.. `పూనకాలే` అనదగ్గ స్థాయిలో ఈ టీజర్ ని రూపొందిస్తున్నారట లోకేశ్ అండ్ టీమ్. మరి.. `విక్రమ్` టైటిల్ టీజర్ లాగే టీజర్ కూడా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.
vikram Movie teaser to release on Kamal Haasan birthday, Kamal Haasan Vikram teaser, kamal haasans upcoming vikram teaser released






