తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని దశాబ్దాలుగా మాస్ ఫాలోయింగ్, బాక్సాఫీస్ క్రేజ్‌తో ఏలుతున్న ఇద్దరు అగ్ర కథానాయకులు విజయ్, అజిత్ కుమార్. ఈ ఇద్దరు దిగ్గజ తారలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు పండగే. తాజాగా బ్రిటన్‌లోని ప్రఖ్యాత 'సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్'లో వీరిద్దరూ అరుదుగా భేటీ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
రేసింగ్ ట్రాక్‌పై ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు ఒకరినొకరు కలుసుకున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరూ తమ బిజీ షెడ్యూల్స్ పక్కనపెట్టి సరదాగా గడపడమే కాకుండా తమ మధ్య ఉన్న అన్యోన్య స్నేహబంధాన్ని మరోసారి చాటిచెప్పారు.
ఈ అరుదైన కలయికలో నటుడు అజిత్ కుమార్.. విజయ్‌కి ఒక ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ రంగులను పోలి ఉండేలా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన రేసింగ్ సూట్‌ను విజయ్‌కి బహుకరించారు. ఈ స్పెషల్ గిఫ్ట్ చూసి విజయ్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, రేసింగ్ పట్ల విపరీతమైన మక్కువ ఉన్న అజిత్.. స్వయంగా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని విజయ్‌ని పక్కన కూర్చోబెట్టుకుని ఆ ట్రాక్‌పై నాలుగు ల్యాప్‌ల పాటు వేగంగా చక్కర్లు కొట్టారు. ట్రాక్‌పై వీరి కార్ రైడ్ అక్కడున్న వారందరినీ మంత్రముగ్ధులను చేసింది.
సినిమా పరంగా, బాక్సాఫీస్ రేసులో వీరిద్దరి మధ్య ఎంతటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే వెండితెర వెనుక వీరిద్దరి మధ్య ఉన్న బంధం, గౌరవం ఎంత గొప్పదో ఈ సంఘటన నిరూపించింది. పోటీని పక్కనపెట్టి ఇద్దరు అగ్ర హీరోలు ఇలా ఆప్యాయంగా మెలగడం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ప్రస్తుతం ఈ కలయికకు సంబంధించిన వార్తలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఈ పిక్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




