Home

»

Latest News

VIjay: వైఫ్ సంగీత విషయంలో విజయ్ కీలక నిర్ణయం.. 23 నే కదా ఎలక్షన్స్

Apr 20, 2026 10:35AM

 

 

-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విజయ్ తీరు 
-మరి విజయ్ అనుకున్నట్టుగానే జరుగుతుందా!
-ఈ రోజే విచారణ

ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కైవసం చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 23 న జరగనున్న ఎన్నికల్లో తమిళ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అనే ఆసక్తి తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా ఇండియా వ్యాప్తంగా అందరిలో నెలకొని ఉంది.  ఈ నేపథ్యంలో విజయ్ కి సంబంధించిన తాజా న్యూస్ ఎలక్షన్ మ్యాటర్ లాగానే వైరల్ గా మారింది


కొన్ని రోజుల క్రితం విజయ్ నుంచి విడాకులు కోరుతు ఆయన భార్య సంగీత(Sangeetha)పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే విజయ్ విడాకులకి ఒప్పుకుంటాడా లేదా అనే క్యూరియాసిటీ అందరిలో నెలకొని ఉంది. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకున్నట్టుగా టాక్. విజయ్ తన భార్యకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని, విడాకుల ప్రక్రియని పరస్పర అంగీకారంతో త్వరగా ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది   అందులో భాగంగా భారీ సెటిల్‌మెంట్‌కి  అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే  250 కోట్ల భరణం ఇవ్వాలని సంగీత కోరుకుందని, విజయ్ మాత్రం  35 కోట్లు ఇవ్వడంతో పాటు కొడుకు, కూతురుని తానే చూసుకుంటానని చెప్పినట్టుగా  సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 


also read: sanskruti jayana: హీరోయిన్ గా మాజీ ముఖ్యమంత్రి మనవరాలు.. హీరో ఇతనే 
    

 ఈ రోజు మాత్రం విజయ్, సంగీత విడాకుల కేసు విచారణకి రానుంది. విజయ్ స్వయంగా హాజరు కావాల్సి ఉండగా,ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఆన్ లైన్ ద్వారా హాజరు కానున్నాడు. ఈ నేసథ్యంలో తీర్పుపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఎలక్షన్స్ లో విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి  పోటీ చేస్తున్నాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com