నెత్తురు, చెమట, హింస చిందిస్తోన్న 'లైగర్'
on Sep 15, 2021
అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'లైగర్' షూటింగ్ బుధవారం తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ, కొంతమంది విదేశీ ఫైటర్లు పాల్గొంటుండగా, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన ఇంటెన్స్ యాక్షన్ సీన్లను డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిత్రీకరిస్తున్నాడు.
'లైగర్'కు సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న చార్మీ కౌర్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. విజయ్ స్టిల్‌ను షేర్ చేసిన ఆమె, “BLOOD SWEAT VIOLENCE begins today.. #shootmode #beastmode #LIGER #salaacrossbreed,” అంటూ రాసుకొచ్చారు.
ఆమె షేర్ చేసిన పిక్చర్లో విజయ్ దేవరకొండ ఐరన్ ఫెన్సింగ్‌తో బోనులాగా తయారుచేసిన బాక్సింగ్ రింగ్‌కు ఆనుకొని విశ్రాంతి తీసుకుంటున్నట్లు కూర్చొని ఉన్నాడు. వీపుపై పెద్ద టాట్టూ కనిపిస్తోంది. పోనీ టైల్తో అతను సరికొత్త అవతారంతో మన ముందుకు రానున్నాడని ఆ స్టిల్ తెలియజేస్తోంది.
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న 'లైగర్' మూవీ ఏక కాలంలో తెలుగు, హిందీ భాషల్లో నిర్మాణమవుతోంది. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు విజయ్. అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తుండగా, రమ్యకృష్ణ, రోణిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పూరి కనెక్ట్స్, కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న 'లైగర్'ను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.