
ఇటీవలే థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్‌తో, సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న మోస్ట్ టాక్డ్ మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ లో కల్ట్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ లీడ్ రోల్‌లో నటించగా, వామిగా గబ్బి హీరోయిన్‌గా అలరించింది. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఆడియన్స్‌కి నెక్స్ట్ లెవెల్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. లోకేష్ కనకరాజ్ మొదటిసారి హీరోగా మారి ఆన్-స్క్రీన్‌పై చూపించిన మాస్ స్వాగ్ చూసి సినీ ప్రియులంతా ఫిదా అయిపోతున్నారు.
అయితే, ఇక్కడే సినీ వర్గాల నుంచి ఒక దిమ్మతిరిగే న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి ఈ 'DC' ప్రాజెక్ట్‌ను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఫస్ట్ ప్లాన్ చేసింది టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతోనే. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కి, ఆయనకున్న మాస్ ఇమేజ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఈ పవర్‌ఫుల్ అండ్ ఇంపాక్ట్‌ఫుల్ కథను అరుణ్ సిద్ధం చేశారు. గతంలో అరుణ్ మాథేశ్వరన్, విజయ్ దేవరకొండ కలిసి కనిపించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ సమయంలో విజయ్ అప్‌కమింగ్ మూవీ స్టోరీ లైన్, ఈ 'DC' కథకు కాస్త దగ్గరగా అనిపించడంతోనే విజయ్ ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పారట. ఒకే రకమైన పాయింట్‌తో వరుసగా సినిమాలు చేస్తే రొటీన్‌గా ఉంటుందనే ఉద్దేశంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ విజయ్ రిజెక్ట్ చేయడంతో.. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ వేరే హీరో కోసం వెతకడం మొదలుపెట్టారు. చివరికి, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌లోని ఆ మాస్ షేడ్స్‌ని గుర్తించి ఆయనను హీరోగా పెట్టి 'DC'గా ఈ సినిమాను పట్టాలెక్కించారు.
ఇప్పుడు కట్ చేస్తే.. థియేటర్లలో 'DC' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా లోకేష్ కనకరాజ్ యాక్టింగ్‌కి విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. విమర్శకుల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ప్రశంసల వర్షం కురుస్తుంటే.. రౌడీ స్టార్ ఫ్యాన్స్ మాత్రం బాగా అప్సెట్ అవుతున్నారు. "విజయ్ ఈ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఒకే చేసి ఉంటే.. ఆయన కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచేది కదా" అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Vijay Deverakonda, DC Movie, Lokesh Kanagaraj, Arun Matheswaran






