Home

»

Latest News

విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా VD-SHOURYUV మూవీ పోస్ట‌ర్ రిలీజ్‌!

May 09, 2026

హీరో విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా లైనప్ లో వైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాణంలో దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్న మూవీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది. టాప్ ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. 'ప్రపంచం వ్యతిరేకించినా, విధి అతన్ని రాజును చేసింది..' అంటూ బర్త్ డే పోస్టర్ పై రాసిన క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చేతిలో ఖడ్గంతో సింహాసనంపై కూర్చుని ఉన్న విజయ్ స్టిల్ తో ఈ పోస్టర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.

ఈ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల  వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజయ్ శౌర్యువ్ మూవీ కూడా ప్రయత్నిస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com