
తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త శకానికి నాంది పలికిన సినీ దళపతి, ప్రస్తుత ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు తన 52వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. విజయ్ కి కూడా స్పెషల్ పుట్టిన రోజు అని చెప్పవచ్చు. కేవలం ఒక సినిమా స్టార్‌గా కాకుండా, ఇప్పుడు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ఒక ప్రజా నాయకుడిగా ఆయన ఈ వేడుకలని జరుపుకుంటున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఒక నెల పూర్తి చేసుకున్న తరుణంలో వచ్చిన ఈ పుట్టినరోజు వేడుకలకి ఒక ప్రత్యేకత ఉండాలని పార్టీ శ్రేణులు భావించాయి. ఇందులో భాగంగానే శివకాశిలో నిన్న ఆదివారం రాత్రి గంటపాటు ఏకధాటిగా సాగిన కంటికింపైన బాణసంచా ప్రదర్శనతో వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయ్ పెరంబూర్ నియోజకవర్గంలోని వ్యాసర్పాడిలో సరికొత్త సదుపాయాలతో కూడిన తన సొంత ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ మరియు పేదలకు సంక్షేమ సహాయం అందించేలా పార్టీ క్యాడర్ విస్తృతమైన సేవా కార్యక్రమాలని చేపట్టింది.
also read: ఈ వారం ఓటీటీలో 21 మూవీస్.. సినీ కిక్కు ప్రాప్తిరస్తు






