
విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో, మారుతి దర్శకుడిగా సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'బాబు బంగారం సెన్సారు కార్కక్రమాలు పూర్తిచేసుకుని, యు/ ఏ సర్టిఫికేట్ పొందింది. ఇటీవల జిబ్రాన్ అందించిన ఆడియో విడుదల కాగా అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాని అగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ."విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్లో వరుస సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు మారుతి డైరక్షన్ లొ ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకష్ణ(చినబాబు) సమర్పణలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాబుబంగారాన్ని నిర్మించామన్నారు. సెన్సారు కార్యక్రమాలను పూర్తిచేసుకుని వారి అభినందనలతో యు/ఏ సర్టిఫికేట్ ని పోందిందన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన ఆడియో, విడియో విజువల్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా నిలవటం చాలా సంతోషంగా వుంది. సౌత్ క్రేజి మ్యూజిక్ దర్శకుడు జిబ్రాన్ అందించిన ఆడియో అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. విక్టరి వెంకటేష్ గారి అభిమానులతో పాటు ఫ్యామిలి ఆడియన్స్‌ని బాబు బంగారం చక్కగా ఆకట్టుకుంటుంది "అని అన్నారు.






