Home

»

Latest News

venu tottempudi: మొహమాటానికి పోయి దెబ్బతిన్నా.. ఆ సినిమా చేయాల్సింది కాదు

May 16, 2026

 

 

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన టైమింగ్, సున్నితమైన హాస్యంతో కుటుంబ ప్రేక్షకులకి ఎంతగానో దగ్గరైన హీరో వేణు తొట్టెంపూడి(venu tottempudi). 'స్వయంవరం', 'చిరునవ్వుతో', 'హనుమాన్ జంక్షన్', 'పెళ్ళాం ఊరెళితే' వంటి అద్భుతమైన చిత్రాలతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ టాలెంటెడ్ యాక్టర్, ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు వెండితెరకి  దూరమయ్యారు. వ్యాపార రంగంలో బిజీగా ఉంటూ సినిమా రంగానికి విరామం ఇచ్చిన వేణు, దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ మూవీ పరాజయాన్ని అందుకుంది.


Also read: Bad boy karthik: సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన బ్యాడ్ బాయ్ కార్తీక్.. ఎందులో ఉందంటే  


 రీసెంట్ గా ఈ సినిమా ఫెయిల్యూర్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, ఆ క్యారక్టర్ వెనుక జరిగిన ఒక చేదు అనుభవాన్ని వేణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టి సంచలనం సృష్టించారు. ఆయన మాట్లాడుతు వాస్తవానికి నేను చాలా కాలం తర్వాత వెండితెరపైకి వస్తున్నప్పుడు ఇంతకంటే చాలా బెటర్ క్యారెక్టర్‌తో రావాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత తనని  తీవ్రంగా ఇబ్బంది పెట్టారని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మొహమాటానికి పోయి, వారి ఒత్తిడి తట్టుకోలేకనే నేను  ఆ క్యారక్టర్  చేయడానికి ఒప్పుకున్నాను. కథ విన్నప్పుడు ఒకటి చెబితే, సెట్స్‌పైకి వెళ్లాక సీన్లు మార్చేశారని వేణు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈసారి కంటెంట్, క్యారెక్టర్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కూడా వేణు చెప్పుకొచ్చాడు.  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com