Home

»

Latest News

వెంకీ అట్లూరి: టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్.!

Aug 14, 2026 2:20PM

ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగి పోకుండా.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చి, టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలి. అలాగే కమ్ బ్యాక్ ఇవ్వగానే రిలాక్స్ అవ్వకుండా, ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలి. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి జర్నీ సరిగ్గా ఇలాగే ఉంది.

యాక్టర్ గా, రైటర్ గా తన సినీ జర్నీ స్టార్ట్ చేసిన వెంకీ అట్లూరి.. 2018లో వచ్చిన 'తొలి ప్రేమ'తో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. రైటర్ గా, డైరెక్టర్ గా ఇంప్రెస్ చేయడమే కాకుండా.. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడంతో.. అందరి దృష్టి వెంకీపై పడింది. 

అయితే ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లో వచ్చిన 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. దాంతో ఇక వెంకీ అట్లూరి పని అయిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. ఒకే తరహా సినిమాలు చేస్తున్నాడే ట్రోల్స్ కూడా వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు వెంకీ.

'రంగ్ దే' ఫెయిల్యూర్ తర్వాత కూడా.. ఆ సినిమాను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్.. వెంకీ టాలెంట్ ని నమ్మి మరో ఛాన్స్ ఇచ్చింది. అలా వచ్చిన సినిమానే 'సార్'. వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్, రైటింగ్, డైరెక్షన్ మెప్పించాయి. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, కమర్షియల్ సక్సెస్ సాధించింది. 

ఇక ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'లక్కీ భాస్కర్' మూవీ ఒక వండర్ అని చెప్పొచ్చు. ఆయన రైటింగ్, డైరెక్షన్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. వెంకీకి బెస్ట్ డైలాగ్ రైటర్ గా నేషనల్ అవార్డు తెచ్చి పెట్టింది.

తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'విశ్వనాథ్ & సన్స్' మూవీ థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా ప్రశంసలు అందుకుంటోంది. వెంకీ ఎంచుకున్న సెన్సిటివ్ పాయింట్ కి, దానిని ఆయన డీల్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ముఖ్యంగా వెంకీ రైటింగ్ పై ప్రశంసల వర్షం వర్షం కురిపిస్తోంది. ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నారని, అందునా డైలాగ్స్ లో డెప్త్ కట్టిపడేసిందని అంటున్నారు. 

సినిమా సినిమాకి తన రైటింగ్ టాలెంట్ ని మరింత మెరుగుపరుచుకుంటూ వరుస సక్సెస్ లు కొడుతున్న వెంకీ అట్లూరి.. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ గా మారిపోయారు.

 

 

 

Venky Atluri, Vishwanath And Sons, Suriya, Mamitha Baiju

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com