Home

»

Latest News

వెంకటేష్, త్రిష మూవీ ప్రారంభం

Apr 5, 2011 5:38PM

venkatesh wallapapers, venkatesh stills, venkatesh images, venkatesh pics, venkatesh photos, venkatesh picturesవిక్టరీ వెంకటేష్ హీరోగా, అందాల త్రిష హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ఏప్రెల్ 4 వ తేదీన ప్రారంభమయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంఏప్రెల్ నాలుగవ తేదీన, ఉగాది పర్వదినం సమదర్భంగా ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రానికి ప్రముఖ యువ దర్శకుడు శ్రీను వైట్ల కెమెరా స్విచ్చాన్ చేయగా, మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు క్లాప్ కొట్టగా, మరో ప్రముఖ యువ దర్శకుడు వినాయక్ ముహూర్తం షాట్ కు గౌరవ దర్స్ఝకత్వం వహించగా ఈ చిత్రం సినీ ప్రముఖుల సమక్షంలో, ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభమయ్యింది.


ఈ వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రానికి కోన వెంకట్ సంభాషణలు వ్రాస్తుండగా, తమన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ బెల్లం కొండ సురేష్ నిర్మించిన "నాగవల్లి" చిత్రం తర్వాత అదే బ్యానర్ లో తాను నటిస్తున్న రెండవ చిత్రమనీ, త్రిషతో మూడవ చిత్రమనీ, ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనీ, అలాగే ఇండియా వరల్డ్ కప్ గెలవటం చాలా ఆనందంగా ఉందనీ, తాను ప్రతి మ్యాచ్ నీ దగ్గరుండి చూడడంతో అక్కడ టీమిండియాని ఛీరప్ చేయటానికి అరిచి అరిచి గొంతు పోయిందనీ అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఇంకా త్రిష, తమన్, మలినేని గోపీచంద్, బెల్లంకొండ సురేష్, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com