
పోషించే పాత్రకు ప్రాణం పోయడం కోసం పాటు పడే అతికొద్ది మంది నటుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ప్రతి సినిమాలోనూ ఆయన పోషించే పాత్ర కోసం షూటింగ్ కు కనీసం నెల ముందు నుంచీ హోమ్ వర్క్ చేస్తారట. అందుకే తాజాగా తాను బాక్సర్ గా నటించనున్న సినిమా కోసం బాక్సింగ్ క్లాసులకు వెళ్తున్నాడట. బాలీవుడ్ సినిమా "సాలా కడూస్"కి రీమేక్ గా తెలుగులో తెరకెక్కనున్న చిత్రంలో మాధవన్ పాత్రను పోషిస్తున్న వెంకటేష్ ఒరిజినల్ వెర్షన్ లో మాధవన్ లుక్ ను డామినేట్ చేసే స్థాయిలో తన లుక్ ను ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకోసం గెడ్డం పెంచుతూ.. అదే సమయంలో జిమ్ కి వెళుతూ బాక్సింగ్ లో మెళకువలు నేర్చుకొంటున్నాడట.
ఇకపోతే.. బాబు నటించిన తాజా చిత్రం "బాబు బంగారం" ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది విడుదలవ్వాగానే బాక్సింగ్ నేపధ్యంలో సినిమా చిత్రీకరణలో పాల్గొంటాడు వెంకీ. ఆ తర్వాత సినిమా కోసం "పెళ్లి చూపులు" ఫేమ్ తరుణ్ భాస్కర్ ను స్క్రిప్ట్ వ్రాయమని చెప్పాడని వినికిడి!






